వెంక‌య్య వ‌ర్సెస్ కోడెల ఫైటింగ్‌

పాలిటిక్స్‌లో నేత‌ల మ‌ధ్య అభిప్రాయ భేదాలు రావొచ్చు.ఇది స‌హజం.

 Kodela Siva Prasad Verses Venkaiah Naidu-TeluguStop.com

అది సొంత పార్టీలోని నేత‌ల మ‌ధ్య కావొచ్చు.చెలిమి చేస్తున్న పార్టీల నేత‌ల మ‌ధ్య కావొచ్చు! ఇప్పుడు ఇలాంటి భేదాలే ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు, కేంద్ర మంత్రి వెంక‌య్య‌ల మ‌ధ్య త‌లెత్తాయి.

వీరిద్ద‌రు కూట‌మి ప‌క్షాల(టీడీపీ-బీజేపీ)కు చెందిన సీనియ‌ర్ నేత‌లు, కీల‌క‌మైన ప‌ద‌వుల్లో ఉన్న‌వారే అయినా.నోట్ల ర‌ద్దు విష‌యం ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టింది.

నోట్ట ర‌ద్దును దేశోప‌కారంగా ప్ర‌చారం చేస్తున్న వెంక‌య్య‌.తాజాగా కోడెల చేసిన వ్యాఖ్య‌ల‌తో ఖంగుతిన‌క త‌ప్ప‌దు!

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం సామాన్యుల‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.

ఏటీఎంలు, బ్యాంకుల వ‌ద్ద క్యూల‌లో నిల‌బ‌డి ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయారు.అయినా కూడా కేంద్రం త‌న చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్ధించుకుంది.

ఆప‌రేష‌న్ చేసే ముందు నొప్పి స‌హ‌జ‌మ‌ని ఆర్థిక మంత్రి జైట్లీ అంటే.న‌ల్ల‌ధ‌నం నివార‌ణ‌కు టీకా వేశామ‌ని, నొప్పి స‌హ‌జ‌మ‌ని, కొన్ని రోజుల్లోనే స‌ర్దుకుంటుంద‌ని, కుదుపులున్నా కుదుట‌ప‌డుతుంద‌ని త‌న‌దైన ప్రాస‌తో ఇర‌గ‌దీశారు.

కేంద్ర మంత్రి వెంక‌య్య‌.నిన్న‌టికి నిన్న రాజ‌మండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.

న‌ల్ల‌ధ‌నంపై ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించేవారు.న‌ల్ల‌ధ‌నాన్ని స‌మ‌ర్ధిస్తున్న‌ట్టేన‌ని అనేశారు.

ఇక‌, వెంక‌య్య కామెంట్ల‌పై నేరుగా కాక‌పోయినా.ఇన్‌డైరెక్ట్‌గా విరుచుకుప‌డ్డారు స్పీక‌ర్ కోడెల‌.

నల్ల‌ధ‌నంతో దేశాన్ని తిప్ప‌లు పెట్టేది వంద‌కి 20 మంది అయితే, మొత్తంగా 80 మందిని ప్ర‌ధాని మోడీ తిప్ప‌లు ఏంట‌ని ప్ర‌శ్నించారు.ఈ ప‌ద్ధ‌తి క‌రెక్టు కాద‌ని, ముందు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేద‌ని అన్నారు.

ఇప్ప‌టికైనా చిన్న నోట్ల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న ప్ర‌వేశ పెట్టి.దేశంలో సాధార‌ణ ఆర్థిక లావాదేవీలు న‌డిచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.

మ‌రి ఈ సూచ‌న‌ల‌నే విప‌క్ష స‌భ్యులు కూడా చేస్తున్నారు.మ‌రి స్పీక‌ర్ కామెంట్ల‌పై వెంక‌య్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube