అధికారిక లాంచనాలతో కోడెల అంత్యక్రియలు

నిన్న ఉదయం హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న మాజీ మంత్రి, మాజీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్‌రావు అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.అందుకు సంబంధించిన ఆదేశాలను ఏపీ సీఎం జగన్‌ ఇప్పటికే ఇచ్చారు.

 Kodela Funeralhome Withformal Ceremonies-TeluguStop.com

సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసినట్లుగా సమాచారం అందుతోంది.రేపు ఉదయం గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో అధికారిక లాంచనాలతో కోడెల అంత్యక్రియలు జరుగబోతున్నాయి.

మాజీ మంత్రి మరియు మాజీ స్పీకర్‌ అవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే ప్రభుత్వ వేదింపుల కారణంగానే కోడెల మృతి చెందాడు అంటూ తీవ్ర విమర్శలు వస్తున్న కారణంగా ప్రభుత్వ లాంచనాలతో కోడెల మృత దేహంకు అంత్యక్రియలు చేయడం ద్వారా కాస్త అయినా విమర్శలు తగ్గుతాయేమో చూడాలి.

నేడు హైదరాబాద్‌ నుండి గుంటూరు పార్టీ ఆఫీస్‌కు తీసుకు వెళ్లి అక్కడ నుండి నరసరావు పేటకు కోడెల పార్ధీవదేహంను తీసుకు వెళ్లనున్నట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube