శృతిహాసన్ ఫిగర్ సమస్యలు ఇంకా తీరడం లేదు   Kodangal By Election Survey Shocking Result     2017-10-31   01:20:20  IST  Bhanu C

తెలంగాణాలో మొన్నటి వరకు ఒక లెక్క..ఇప్పటి నుంచే ఒక లెక్క రేవంత్ అన్న వచ్చాడు అని చెప్పు..ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే హాట్ సెటైర్స్..నిజమే మొన్నటివరకు తెలంగాణలో కేసీఆర్ కి తిరుగులేదు..టిడిపిలో ఉన్నంతకాలం రేవంత్ కి ఎదుగుదల లేదు..వ్యక్తిగతంగా ఎంతో ఎత్తుకు ఎదగగల నాయకుడు అవకాసం ఉండి కూడా ఎదగలేకపోవడంతో రేవంత్ కాంగ్రెస్ లోకి రావడం..వచ్చి రాగానే కేసీఆర్ టార్గెట్ గా తన కొడుకు కేటిఆర్ మీద మాటల దాడి చేయడం ఇవన్ని జరిగిపోయాయి ఈ పరిణామాలతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది అనే చెప్పాలి.

కేసీఆర్ అంటే ముందు నుంచి నిప్పు ఉప్పులా ఉండే రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరికతో మరింత స్పీడు పెంచేశాడు. టీఆర్ఎస్‌కు ధీటైన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రావ‌డం తెలంగాణ పాలిటిక్స్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. నిన్న‌టి వ‌ర‌కు టీడీపీలో తిరుగులేని కింగ్‌గా ఉండి కేసీఆర్‌ను ఢీకొట్టిన రేవంత్ ఇప్పుడు మ‌హాస‌ముద్రం లాంటి కాంగ్రెస్‌లో క‌లిసిపోయారు. ఇదిలా ఉంటే టీడీపీతో పాటు ఆ పార్టీ ప‌ద‌వులుకు రాజీనామా చేసిన రేవంత్ కొడంగ‌ల్ ఎమ్మెల్యే ప‌ద‌వికి సైతం రాజీనామా చేశారు. ఉప ఎన్నిక‌కు ముందే సిద్ధ‌మైన రేవంత్ త‌న ప‌ద‌విని వ‌దులుకున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఉప ఎన్నిక వ‌స్తే కొడంగ‌ల్‌లో త‌న ప‌రిస్థితి ఎలా ఉంటుంది ? అన్న‌దానిపై రేవంత్ ముందుగానే స‌ర్వే చేయించుకున్న‌ట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ఈ స‌ర్వేలో రేవంత్‌కు కొడంగ‌ల్‌లో మ‌రోసారి రేవంత్ తన సత్తా చాటుతాడు అని సర్వే లో తేలిపోయింది.

ఈ సర్వే ని ఎంతో పక్కగా రేవంత్ ప్లాన్ చేశాడట.అక్టోబర్ లోనే ఈ సర్వే జరిగిందని తెలుస్తోంది.. తాజా స‌ర్వేలో రేవంత్‌కు 54 శాతం ఓట్లు వ‌స్తే, టీఆర్ఎస్‌కు 31 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని తేలింద‌ట‌. దీనిని బ‌ట్టి చూస్తే రేవంత్‌కు 23 శాతం ఓట్లు అద‌నంగా వ‌స్తాయ‌న్న‌మాట‌. ఇక రేవంత్‌కు పార్టీల‌కు అతీతంగా కొడంగ‌ల్‌లో సొంత ఓటు బ్యాంకు చాలానే ఉంది. అందుకే కేసీఆర్ చాలా మంది టిడిపి వాళ్ళని కారు ఎక్కించుకున్నా..రేవంత్ కి వచ్చే నష్టం ఏమి లేదని తేలిపోయింది. చంద్రబాబు పై అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం వలన టీడీపీ ఓట్లు కూడా రేవంత్‌కే బ‌దిలీ అవుతాయి.

రేవంత్ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఐదుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ‌రెడ్డిని 2009,2019 ఎన్నికల్లో వరుసగా ఓడించాడు..2009లో 7 వేల మెజార్టీతో గెలిచిన రేవంత్ గ‌త ఎన్నిక‌ల్లో ఏకంగా 14 వేల మెజార్టీతో గెలిచాడు. గురునాధరెడ్డి ని పోటీలోకి దింపాలని ప్రయతిస్తుంటే నా వల్ల కాదు అంటూ ముందే చేతులు ఎత్తేసాడట. ఈ పరిణామాలతో..కేసీఆర్ మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డి సోద‌రుడు, ఎమ్మెల్సీ ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డిని రేవంత్ కి పోటీగా దించుతారని సమాచారం.కొడంగల్ లో రేవంత్ కి ఎంత బలం ఉందనేది కేసీఆర్ కి తెలుసు..ఒకవేళ రేవంత్ ఉపఎన్నికల్లో గెలిస్తే తెలంగాణలో కేసీఆర్ ని ఎదుర్కోగల వ్యక్తి రేవంత్ అనేది ప్రజలలోకి వెళ్తే టిఆర్ఎస్ కి నష్టమే.