సూపర్ స్టార్ మెడకు చుట్టుకున్న ఏనుగు దంతాల కేసు,పరిస్థితి ఏంటో!  

Forest Department Files Charge Sheet Filed Against Mohanlal-kannada Superstar Mohanlal,mohanlal

మలయాళ సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్, అటు మలయాళం లోనూ ఇటు తెలుగు,తమిళ భాషల్లో కూడా పలు చిత్రాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.అయితే అలాంటి మోహన్ లాల్ పై కేసు నమోదు చేసి కోర్టు లో హాజరు పరచాలని చూస్తున్నారు అటవీశాఖ అధికారులు.

Forest Department Files Charge Sheet Filed Against Mohanlal-kannada Superstar Mohanlal,mohanlal-Forest Department Files Charge Sheet Filed Against Mohanlal-Kannada Superstar Mohanlal

ఏడేళ్ల క్రితం నమోదైన ఈ కేసు ఇప్పుడు హియరింగ్ కు రావడం తో ఈ కేసు సూపర్ స్టార్ మెడకు చుట్టుకొని పరిస్థితి ఏర్పడింది.2012 లో మోహన్ లాల్ ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతపు కళాఖండాలు కలిగి ఉన్నారు అంటూ ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఎర్నాకులం లోని కోర్టు లో అతనిపై చార్జిషీట్ కూడా దాఖలైంది.

Forest Department Files Charge Sheet Filed Against Mohanlal-kannada Superstar Mohanlal,mohanlal-Forest Department Files Charge Sheet Filed Against Mohanlal-Kannada Superstar Mohanlal

ఏనుగు దంతాల విషయంలో మోహన్ లాల్ ప్రధాన నిందితుడు కూడా కావడం దానికి తోడు ఆయన నేరం కూడా ఒప్పుకున్నాడు.ఇక ఇప్పుడు పెరుంబవూరులోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తో పాటు కోదనాడ్ రేం‌లోని మేకప్పల ఫారెస్ట్ స్టేషన్‌లో కూడా ఈ కేస్ నమోదైంది.

అయితే తన పై కేస్ నమోదు అయిన తర్వాత ఏనుగు దంతాల కళాఖండాలను ఇంట్లో ఉంచుకునేందుకు తనకు అనుమతి ఉందంటూ కోర్టుకు తెలిపాడు మోహన్ లాల్.తాను కె కృష్ణన్‌ అయ్యర్‌ అనే వ్యక్తి నుంచి 65 వేల రూపాయలకు వీటిని కొనుగోలు చేశానని మోహన్‌లాల్‌ చెప్పుకొచ్చాడు.దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం ఏనుగు దంతపు కళాఖండాలను ఉంచుకునేందుకు మోహన్‌లాల్‌కు సరైన అనుమతి లేదని తేల్చేయడం తో ఇప్పుడు ఈ కేసు సూపర్ స్టార్ మెడకు చుట్టుకోనుంది.

ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఈయనకు ఎలాంటి అనువైన అనుమతి ఇవ్వలేదని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో కేస్ మళ్లీ మొదటికి వచ్చేసింది.దాంతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3)తో మోహన్‌లాల్‌పై నేరం రుజువు చేయొచ్చని హైకోర్టు తేల్చడం ఇప్పుడు సంచలనంగా మారింది.

కాగా కొన్ని రోజుల కింద భారతీయ వన్య ప్రాణి చట్టంలోని సెక్షన్ 44(6) కింద మోహన్ లాల్‌పై కేస్ నమోదు చేసి ప్రధాన నిందితుడిగా కోర్ట్ తేల్చేసిన విషయం విదితమే.అయితే ఇప్పుడు ఈ ఏనుగు దంతాల కేస్ కూడా ఆయన మెడకు చుట్టుకుంటే పరిస్థితి ఏంటా అని నిర్మాతలు కంగారు పడుతున్నారు.

ఇప్పటికే పలు సినిమాలతో బిజీ గా ఉన్న ఈ సూపర్ స్టార్ ఇప్పుడు ఈ కేసు మెడకు చుట్టుకుంటే నిర్మాతల పరిస్థితి ఏంటో అన్నది మాత్రం అర్ధంకావడం లేదు