కోడలిపై మామ కన్ను..చివరికి అన్నంతపని చేశాడు       2018-06-12   04:45:08  IST  Raghu V

భారత దేశం అంటే రక్త సంభందాలకి..అనుభందాలకి ప్రతీక..ఎన్నో సాంప్రదాయాలకి కట్టుబాట్లకి లోబడి ఉన్న భారత దేశంలో రాను రాను విచ్చల విడి శృంగారం, వావి వరసలు మర్చిపోవడం ఎక్కువయ్యి పోయింది..కన్న తండ్రి తన కూతిరిపైనే అత్యాచారానికి ఒడిగడుతున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో కోకొల్లలుగా జరుగుతున్నాయి..అయితే తాజాగా కోడలిని కోరిక తీర్చమని ఆమె మామ బలవంతం చేశాడు కాదనదన్న కోపంతో కత్తితో నరికేసిన ఘటన సిద్ధవటం లో చోటు చేసుకుంది..వివరాలలోకి వెళ్తే..

సిద్దవటం మండలం భాకరాపేటలోని ఆంజనేయ స్వామి గుడి వెనుక వీధిలో కాడే సుబ్బయ్య కుమారుడు రామమోహన్‌ ఉంటున్నారు ఇతడికి కదిరికి చెందిన సుగుణతో అనే ఆమెతో కొన్నేళ్ళ క్రితం పెళ్లి అయ్యింది అయితే తన ఈ కుటుంభం అందరూ కలిసి ఒకే ఇంటిలో కాపురం ఉంటున్నారు…అయితే ఆమె మామయ్యా అయిన సుబ్బయ్య కి తన కోడలిపై మనసు పడింది గతంలో రెండు సార్లు లైంగిక దాడికి ప్రయత్నించగా పెద్దలు ముందు ఆ గొడవని పరిష్కరించారు..అయితే

వరుసగా మళ్ళీ అదే తప్పు చేస్తూ ఆమెని లోబరుచుకోవాలని మళ్ళీ సుబ్బయ్య ప్రయత్నాలు చేయడంతో ఆమె విసిగిపోయింది దాంతో సుబ్బయ్యపై పోలీసలకి కంప్లైంట్ చేసింది దాంతో పోలీసులు సుబ్బయ్య కోసం గాలిపు చేపట్టారు అయినా సుబ్బయ్య తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు ..ఈ క్రమంలోనే సుబ్బయ్య తనపైనే పోలీసు స్టేషన్‌లో కేసు పెడతావా అని కోడలిపై కక్ష పెంచుకున్నాడు. ఆదివారం ఉదయ కోడలు సుగుణ ఇంట్లో మాంసం కోసుకుంటుండగా వెనుక వైపు నుంచి వచ్చిన సుబ్బయ్య ఆమె కాళ్లు, చేతులపై మచ్చుకత్తితో దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రిజకి పంపారు..ఇంతటి ఘోరానికి పాల్పడిన సుబ్బయ్యని అదుపులోకి తీసుకుని కేసుని అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు..