కొడాలి నాని ధైర్యం అదేనా.. అందుకేనా ఈ స‌వాళ్లు..

ఆయ‌న మాట్లాడే ప్ర‌తి మాట ఓ తూటాలా పేలుతుంది.ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు గాంచిన ఆయ‌న‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది.

 Kodali Nani's Courage   Therefore These Challenges    Kodali Nani, Ycp, Ys Jagan-TeluguStop.com

ఫ్యామిలీకి పొలిటిక‌ల్ బ్యాక్ గ్రౌండ్ లేక‌పోయినా స‌రే త‌న సొంత కాళ్ల మీద నిల‌బ‌డ్డ ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్‌.ఇంత‌కీ ఆయ‌నెవ‌రో గుర్తుకు వ‌చ్చిందా.? ఆయ‌నేనండి కొడాలి నాని.వైసీపీలో కీల‌క నేత‌గా ఉన్నారు.

జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా అన‌తి కాలంలోనే పేరు తెచ్చుకున్నారు కొడాలి నాని.ఒకానొక స‌మ‌యంలో జ‌గ‌న్ కూడా త‌న‌కు ఉన్న గొప్ప స‌హ‌చ‌రుల్లో కొడాలి నాని ఒక‌రు అని చెప్ప‌డం కూడా విశేషం.

అలాంటి కొడాలి నాని మీద ఈ న‌డుమ విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త వ‌స్తోంది.ఆయ‌న మాట‌లు మ‌రీ హ‌ద్దులు దాటిపోతున్నాయ‌ని అంటున్నారు.ముఖ్యంగా చంద్ర‌బాబు నాయుడు, లోకేష్ విష‌యంలో ఆయ‌న వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం, తిట్ల పురాణం లాంటివి ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గం అయిన క‌మ్మ వ‌ర్గానికి మింగుడు ప‌డ‌టం లేదు.టీడీపీని అమితంగా అభిమానించే క‌మ్మ సామాజిక వ‌ర్గానికే చెందిన కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం అంద‌రినీ క‌ల‌వ‌ర పెడుతున్నాయి.

ముఖ్యంగా ఆ వ‌ర్గంలో ఆయ‌న మీద చ‌ర్చ సాగుతోంది.

Telugu Ap, Chnadrababu, Kodali Nani, Nra Lokesh, Tdp, Ys Jagan-Telugu Political

అయితే ఇంత జ‌రుగుతున్నా కొడాలి నానికి ఓ ధైర్యం ఉంది. అదేంటంటే గుడివాడ‌లో తాను క‌మ్మ వ‌ర్గం మీటింగ్ పెడ‌తాన‌ని, త‌న‌ను విమ‌ర్శిస్తున్న వారు ఆ మీటింగ్ కు వ‌స్తే ఎవరిని గుడ్డ‌లూడ‌దీసి కొడ‌తారో గుడివాడ క‌మ్మ ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని స‌వాల్ విసిరారు.మ‌రి ఈ స‌వాల్ విస‌ర‌డానికి నానికి ఉన్న ధైర్యం ఏంటంటే.

గుడివాడ‌లో 20వేల‌కు పైగా క‌మ్మ ఓట‌ర్లు ఉన్నారు.వీరంతా నానికి స‌పోర్టు.

అలాగే గుడివాడ‌లో ఉన్న జూనియ‌ర్ అభిమానులంతా నానికి అభిమానులే.కాపు, ముస్లిం ఓట‌ర్లు కూడా నానికి స‌పోర్టుగానే ఉన్నారు.

ఈ అండ‌తోనే త‌న‌ను గుడివాడ‌లో ఎవ‌రూ ఏం చేయ‌లేర‌నే ధైర్యం మొద‌టి నుంచి నానికి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube