లోకేష్, చంద్రబాబు లపై సీరియస్ కామెంట్లు చేసిన కొడాలి నాని..!!

మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆయన కుమారుడు నారా లోకేష్ పై మండిపడ్డారు.ఇటీవల లోకేష్ సీఎం జగన్ నీ పరుష పదజాలంతో దుర్భాషలాడటం తో కొడాలి నాని సీరియస్ అయ్యారు.

 Kodali Nani Serious Comments On Lokesh And Chandrababu-TeluguStop.com

లోకేష్ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అని అన్నారు.అదే రీతిలో అర్థం పర్థం లేని లెటర్లు రాస్తూ చంద్రబాబు వ్యవహరిస్తున్నారని.

జూమ్ లో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు.

 Kodali Nani Serious Comments On Lokesh And Chandrababu-లోకేష్, చంద్రబాబు లపై సీరియస్ కామెంట్లు చేసిన కొడాలి నాని..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాన్యం కొనుగోలు విషయంలో… ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది అంటూ చంద్రబాబు రాసిన లెటర్ ని తీవ్రస్థాయిలో కొడాలి నాని తప్పుపట్టారు.రైతుల పట్ల ప్రభుత్వం నిస్వార్థంగా పని చేస్తుందని అందువల్లే గతంలో చంద్రబాబు హయాంలో రైతులకు సంబంధించి బకాయిలు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కట్టడం జరిగింది ఇది వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న అంకితభావం అని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో రైతుల రుణాలకు సంబంధించి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు సీఎం జగన్ చెల్లించడం జరిగిందని కొడాలి నాని తెలిపారు.పిచ్చి కాగితంపై ఇష్టానుసారం అయిన రాతలు.

లెటర్లు రాయకూడదని చంద్రబాబు కి కొడాలి నాని చురకలంటించారు.వైయస్ జగన్ రైతు బాంధవుడు.

అటువంటి వ్యక్తి పైన ఇష్టానుసారంగా ఆరోపణలు చేయకూడదని.కొడాలి నాని సీరియస్ కామెంట్లు చేశారు.

గతంలో రైతు రుణమాఫీ అని చెప్పి రైతులకు పంగనామాలు పెట్టిన ప్రభుత్వం మీదే అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.ఏది ఏమైనా ధాన్యం కొనుగోలు విషయంలో జగన్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది అని చంద్రబాబు రాసిన లెటర్ పై భారీగా కొడాలి నాని కౌంటర్ లు వేశారు.

#Chandrababu #Kodali Nani #Lokesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు