చంద్రబాబూ.. కుప్పంలో గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మంత్రి కొడాలి నాని సవాల్

అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలంటున్నా చంద్రబాబు.ముందు కుప్పంలో రాజీనామా చేసి మళ్లీ గెలవాలని అదే జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు.

 Kodali Nani Serious Comments About Chandrabbau-TeluguStop.com

పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లె, ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మగడ్డ, అయిన అత్తగారి ఊరు, చంద్రబాబు కుటుంబ సభ్యులు దత్తత తీసుకున్న ఊరు  కొమరవోలు ఇలా ఎక్కడ తెలుగుదేశం పార్టీ గెలవ లేదని ఎద్దేవా చేశారు.తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు విజయవాడలో బహిరంగ సభ పెట్టి ప్రజలను బూతులు తిట్టాడని జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా తీసేస్తున్నారు మీకు సిగ్గు, శరం ఉంటే నాకు ఓటు వేయండని అడ్డుకున్నా ప్రజలు మాత్రం కనికరించలేదన్నారు.

కానీ జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి ఎక్కడికి బయటకు రాలేదన్నారు.కేవలం ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, మా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు మీద నమ్మకంతోనే ప్రజలు దీవించారు అన్నారు.

 Kodali Nani Serious Comments About Chandrabbau-చంద్రబాబు.. కుప్పంలో గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మంత్రి కొడాలి నాని సవాల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏ ఎన్నికలు చూసిన ప్రజలు అది తరగని అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు.మున్సిపల్, సర్పంచ్, పరిషత్ ఇలా ఎన్నిక ఏదైనా ఇంత స్పష్టంగా ప్రజలు తీర్పు ఇస్తూంటే.

చూసి ఓర్వలేక చంద్రబాబు తాను ఎన్నికల్లో పోటీ చేయలేదని చేతగాని కబుర్లు చెబుతున్నాడు అని ఎద్దేవా చేశారు.చంద్రబాబు ఎన్నికలు బహిష్కరించడం కాబట్టే ఆయన నియోజకవర్గంలోని కుప్పం ప్రజలంతా వైఎస్ఆర్ సిపి కి ఓటు వేశారా అంటూ ప్రశ్నించారు.

దాదాపు 900ల ఎంపీటీసీ లను టీడీపీ గెలుచుకుంటుందని వాళ్లంతా చంద్రబాబునాయుడు చెప్పినా వినకుండా ఎన్నికల్లో పోటీ చేసిన తిరుగుబాటు అభ్యర్థులా.‌ అంటూ నిలదీశారు.అలా అయితే వాళ్లందరినీ సస్పెండ్ చేస్తారా అంటూ ప్రశ్నించారు.

#Ysrcp #Kodali Nani #Chandra Bbau #AP Poltics #Kodali Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు