జూ. ఎన్టీఆర్ పై కొడాలి నాని కామెంట్స్ ! స్నేహం కాదు విబేధాలు అంటూ... ?

Kodali Nani Sensational Comments On Jr Ntr

నందమూరి కుటుంబానికి మంత్రి కొడాలి నాని కి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ముఖ్యంగా నందమూరి హరికృష్ణఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో నాని మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.

 Kodali Nani Sensational Comments On Jr Ntr-TeluguStop.com

నందమూరి హరికృష్ణ మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ నాని సానుకూలంగా ఉంటూ వస్తున్నారు.ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం కొడాలి నాని విషయంలో ఆస్థాయిలో తన అభిమానాన్ని చాటుకుంటారు .
       నాని అన్నయ్య అంటూ ఆప్యాయతగా మాట్లాడుతూ ఉంటారు.అయితే కొద్ది రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ లో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులను ఉద్దేశించి కొడాలి నాని తో పాటు , అంబటి రాంబాబు తదితరులు అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు మీడియా సమావేశంలో బోరున విలపించారు.

ఇక ఈ వ్యవహారంపై నందమూరి కుటుంబం అంతా మీడియా సమావేశం నిర్వహించగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా వీడియో ద్వారా తన సందేశాన్ని వినిపించారు  ఆ వీడియో లో ఏ పార్టీ పేరు కాని,  వ్యక్తులను కానీ ప్రస్తావించకుండా విమర్శలు చేశారు.దీనిపై టిడిపి నేతలు జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు చేశారు.
   

 Kodali Nani Sensational Comments On Jr Ntr-జూ. ఎన్టీఆర్ పై కొడాలి నాని కామెంట్స్ స్నేహం కాదు విబేధాలు అంటూ… -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Ambati Rambabu, Ap Government, Cbn, Chandrababu, Gannavaram Mla, Jagan, Jr Ntr, Juniour Ntr, Kodali Nani, Vallabaneni Vamsi-Telugu Political News

   ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్  మంత్రి కొడాలి నాని, వంశీ ని కంట్రోల్ చేస్తున్నారని ,  జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన విధంగా కొడాలి నాని , వంశీ, వ్యవహరిస్తున్నారని విమర్శలు చేయడం పై తాజాగా మంత్రి కొడాలి నాని స్పందించారు.ఎన్టీఆర్ కుటుంబం పై తనకే కాదు,  ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుందని, ఏపీ సీఎం జగన్ కి కూడా ఎన్టీఆర్ కుటుంబం అంటే ఎంతో అభిమానం అని నాని చెప్పుకొచ్చారు.ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది అని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులను నమ్మించిన ఘనత చంద్రబాబుది అంటూ విమర్శలు చేశారు.రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు తన భార్య పేరును బయటకు తీసి అల్లరి చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ను తాను గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని కంట్రోల్ చేస్తున్నామనే  విమర్శలపై నాని స్పందించారు.తనకి వంశీకి ఎన్టీఆర్ మాట వినాల్సిన అవసరం ఏంటని ?  తమను కంట్రోల్ చేయడానికి తాము ఏమైనా ఎన్టీఆర్ నిర్మాతలమా అంటూ నాని ప్రశ్నించారు.గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న మాట నిజమేనని,  కాని తర్వాత తమ మధ్య విభేదాలు వచ్చి విడిపోయమని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

#NTR #Jr NTR #Jagan #AP #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube