పచ్చ పకోడీగాళ్లు అంటూ.... లోకేష్ ట్విట్ కి కొడాలి నాని ఘాటు కౌంటర్  

Kodali Nani Reply Counter On Nara Lokesh Twit-

ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగిసింది. గుంటూరు సభలో ప్రధాని టీడీపీని ఉద్దేశించి అనేక విమర్శలు చేశారు.దీనికి టిడిపి నుంచి కూడా గట్టిగానే కౌంటర్ లు పడ్డాయి..

పచ్చ పకోడీగాళ్లు అంటూ.... లోకేష్ ట్విట్ కి కొడాలి నాని ఘాటు కౌంటర్ -Kodali Nani Reply Counter On Nara Lokesh Twit

అయితే మోడీ వెళ్లిపోయినా… ఇప్పుడు ఆ తాలూక ఎఫెక్ట్ గట్టిగా కనిపిస్తోంది. ప్రధానంగా టిడిపి వర్సెస్ వైసిపి అన్నట్టుగా రాజకీయ విమర్శలు స్టార్ట్ అయ్యాయి ప్రధాని పర్యటన సందర్భంగా నగరంలో అనేకచోట్ల హోర్డింగులు పోస్టర్లు అంటించారు బిజెపి నేతలు. అయితే ఏపీలో ప్రధాని టూర్ ను స్వాగతిస్తున్నట్లు గా అది కూడా వైసిపి రూపొందించినట్లుగా ఉన్న ఓ పోస్టర్ ను ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

ఆంధ్రులు చేస్తున్న ఆందోళన మద్దతు పలకపోగా. మోడీ గారి తో జోడీ కట్టిన జగన్ గారు వైసిపి కార్యకర్తలను మోడీ సభకు పంపుతున్నారా.? అంటూ… లోకేష్ తన ట్విట్టర్లో ఘాటుగా పోస్టింగ్ పెట్టారు. అయితే దీనికి వైసీపీ నుంచి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.

పచ్చ పకోడీల్లారా. దమ్ముంటే నా దగ్గరకు రండి..

సమాధానం చెప్తా .ఇలా మీకు మీరే జగనన్న ఫోటో నా ఫోటో పెట్టి బ్యానర్లు వేసుకుని ఆనందం పొందడం ఏంది రా .? నాలుగేళ్ల మోడీ సంక నాకింది ఎవరు .

? నాలుగేళ్లు కాపురం చేసింది మీరు మేము కాదు… మోడీ అయినా చంద్రబాబు లాంటి కేడి అయినా మాకు ఒకటే అంటూ టీడీపీకి కౌంటర్ ఇచ్చాడు.