కళ్యాణ్ రామ్ తో సినిమా ప్లాన్ చేస్తున్న వైసీపీ మంత్రి

వైసీపీలో ఉన్న చాలా మందికి నందమూరి ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.వారిలో ఎక్కువ మంది చంద్రబాబుని వ్యతిరేకిస్తారు తప్ప నందమూరి ఫ్యామిలీని వ్యతిరేకించరు.

 Kodali Nani Plan Movie With Kalyan Ram, Tollywood, Jr Ntr, Nandamuri Fans, Tarak-TeluguStop.com

ముఖ్యంగా కృష్ణ జిల్లాకి చెందిన కొడాలి నాని, జూనియర్ ఎన్ఠీఆర్ కి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.తారక్ కూడా చాలా సందర్భాలలో ఈ విషయాన్ని మీడియాలో వెల్లడించారు.

అయితే కొడాలి నాని ప్రస్తుతం వైసీపీలో సర్కార్ లో మంత్రిగా ఉంటూ అవకాశం దొరికిన ప్రతి సారి చంద్రబాబు మీద బూతులతో రెచ్చిపోతూ ఉంటారు.గతంలో ఎన్ఠీఆర్ సినిమాలకి కొడాలి నాని, వల్లభనేని వంశీ పెట్టుబడులు కూడా పెట్టారు.

అయితే వారు రాజకీయాలలో బిజీ అయిపోయిన తర్వాత సినిమాల జోలికి వెళ్ళలేదు.అయితే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మంత్రి కొడాలి నాని నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

కొడాలి నాని, వంశీ కలిసి ఈ సినిమా నిర్మించడానికి సిద్ధం అవుతున్నారని చర్చ నడుస్తుంది.హరికృష్ణ ఫ్యామిలీతో ఉన్న సన్నిహత సంబంధాల కారణంగా ఈ మధ్య ఎన్ఠీఆర్, కళ్యాణ్ రామ్ కి వారు టచ్ లోకి వెళ్లారని, ఈ సందర్భంగా సినిమా నిర్మాణం గురించి చర్చించినట్లు ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు.

ఓ యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమాని కళ్యాణ్ రామ్ తో అయితే బాగుంటుందని భావించి అతడిని నందమూరి హీరో దగ్గరకి పంపించడం జరిగిందని తెలుస్తుంది.అతను చెప్పిన కథ కళ్యాణ్ రామ్ కి కూడా నచ్చడంతో ఇక సెట్స్ పైకి వెళ్ళడానికి ప్లానింగ్ చేస్తున్నారని సమాచారం.

కరోనా సిచువేషన్ సాధారణ స్థితికి రాగానే దీనిపై ఎనౌన్స్ మెంట్ ఉంటుందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube