కొడాలి నాని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. స‌హ‌నం కోల్పోతున్నారా..?

ఏపీలో వైసీపీ మంత్రి కొడాలి నాని అంటే మాస్ లీడ‌ర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆయ‌న జ‌గ‌న్ ను ఎవ‌రేమ‌న్నా స‌రే వెంట‌నే కౌంట‌ర్లు వేసేస్తుంటారు.

 Kodali Nani Controversial Comments .. Are You Losing Patience ..?, Kodali Nani,-TeluguStop.com

ఇక చంద్ర‌బాబు అంటేనే ఒంటి కాలిపై లేస్తూ కౌంట‌ర్ల మీద కౌంట‌ర్లు వేసేస్తుంటారు.ఈయ‌న ఒకప్పుడు టీడీపీలో ఉంటూ చంద్రబాబుకు న‌మ్మిన బంటుగా నంద‌మూరి ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితుడిగా ఇంకా చెప్పాలంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ అనుచరుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు.

కానీ ఆ త‌ర్వాత జగన్ కు ద‌గ్గ‌రై వైసీపీలో కీల‌క నేత‌గా ఎదిగారు కొడాలి నాని.

ఇత‌ర పార్టీల వారెవ‌రైనా స‌రే జ‌గ‌న్ ను గానీ లేదంటే వైసీపీని గానీ విమ‌ర్శిస్తే అంద‌రికంటే ముందు కౌంట‌ర్ల వేసే బాధ్య‌త‌ను కొడాలి నాని తీసుకుంటున్నారు.

ఇక ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చిన త‌ర్వాత ఈ బాధ్య‌త‌ను మ‌రింత పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు కొడాలి.నాని.కాగా అప్పుడ‌ప్పుడు ప్రెస్‌మీట్లో చంద్ర‌బాబు నాయుడు లేదంటే లోకేష్ గురించి మాట్లాడేట‌ప్పుడు కొడాలి నాని కొన్ని సార్లు కంట్రోల్ త‌ప్పి తీవ్రపదజాలంతో దూషిస్తుంటారు.ఇక ఇప్పుడు కూడా మ‌రోసారి ఇలాగే అదుపు త‌ప్పి మాట్లాడారు కొడాలి నాని.

Telugu Ap Poltics, Chandra Babu, Kodal Nani, Kodali Nani, Patience, Ysrcp-Telugu

ప్ర‌స్తుతం గుంటూరు ఇంజినీరింగ్ స్టూడెంట్ రమ్య హత్యోదంతం గురించి అందరికీ తెలిసిందే.అయితే ఈ విషయమై చర్యలు తీసుకోవాడంలో ముందుండాల్సిన ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంత్రిగా ఉన్న కొడాలి నాని మ‌రోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.కాగా ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తే మంత్రి తీవ్ర ఫ్ర‌స్ట్రేష‌న్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.చంద్రబాబులాంటి వెధవ దళిత యువతిని దారుణంగా మ‌ర్డ‌ర్ చేశాడంటూ మండి ప‌డ్డారు.చంద్రబాబుకు, ఆ యువతిని హత్య చేసిన నిందితుడికి పెద్ద తేడా కూడా లేదంటూ సంచ‌ల‌న కామెంట్లు చేయ‌డం ఇప్పుడు పెద్ద దుమార‌మే రేపుతోంది.ఒక మాజ సీఎంను అలా మాట్లాడ‌టం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ నెటిజ‌న్లు కూడా కౌంట‌ర్ వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube