జగన్‌కు కొత్త పేరు, పిల్లలందరికి మామ  

Kodali Nani Comments On Ap Cm Jagan - Telugu Ap Cm Jagan, Jagan Mamma, Kodali Nani, , Vijayawada Mla Kodali Nani

ఏపీలో పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం చదువులను చెప్పించబోతున్న జగన్‌పై వైకాపా నాయకుడు, మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఈ పనితో నాని ఒక గొప్ప నాయకుడిగా గుర్తింపు దక్కించుకున్నాడంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Kodali Nani Comments On Ap Cm Jagan

ఇకపై ఏపీ పిల్లలు అంతా కూడా జగన్‌ను మామ అంటూ అభినందిస్తున్నారు.తమకు మేనమా దొరికాడంటూ పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారని, తన తల్లులకు అన్నలాగా తమకు మేనమామ లాగా మా ఇంటికి పెద్ద దిక్కులా జగన్‌ ఉంటున్నాడంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జగన్‌ చేస్తున్న పనితో ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారు కూడా భవిష్యత్తులో సెల్యూట్‌ చేస్తారంటూ నాని అభిప్రాయం వ్యక్తం చేశాడు.తెలుగు దేశం పార్టీ నాయకులకు విమర్శలు చేయడం తప్ప మరేమీ లేదని, వారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృధ్దిని చూసి ఓర్వలేక పోతున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇంగ్లీష్‌ మీడియంపై విమర్శలు చేస్తున్న నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.చేతకాని వారికి ఇలాంటి పనులు ఆశ్చర్యంగా తప్పుగా ఉంటాయంటూ నాని అభిమాప్రాయం వ్యక్తం చేశాడు.

ఇంగ్లీష్‌ మీడియంతో పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రగతి సాధిస్తారనే నమ్మకంను నాని వ్యక్తం చేశాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test