చంద్రబాబు కుటుంబాన్ని తిడుతూనే ఉంటా అని అంటున్న కొడాలి నాని!

వైసీపిలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కొడాలి నాని.టీడిపి నుండి బయటకు వచ్చి సక్సెస్ అయిన అతికొద్దిమంది నాయకులలో ఒకరు.

 Kodali Nani Comments On Cbn, Kodali Nani, Chandrababu, Ysrcp, Ap, Gudiawada, Jagan Governament-TeluguStop.com

ఇక ఈయన మొదట నుంచి చంద్రబాబుని డైరెక్ట్ గా టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు.దీన్ని ఎంతమంది ఎన్నిసార్లు వ్యతిరేకించిన ఆయన తన ధోరణి మార్చుకోలేదు.

ప్రస్తుతం వైసిపి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న ఈయన తాజాగా గుడివాడలో పర్యటించారు ఈ సందర్భంగా మీడియా వారితో మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేదలకు కేటాయించే ఇళ్ల స్థలాలను మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేయాలని మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

 Kodali Nani Comments On CBN, Kodali Nani, Chandrababu, YSRCP, AP, Gudiawada, Jagan Governament-చంద్రబాబు కుటుంబాన్ని తిడుతూనే ఉంటా అని అంటున్న కొడాలి నాని-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్నిచోట్ల పనిలేని టీడిపి నాయకులు కోర్టు మెట్లెక్కి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను ప్రస్తుతానికి ఆపించారని త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరించి వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇక తను చంద్రబాబు పైన ఆయన కుటుంబం పైన చేస్తున్న విమర్శలను టీడిపి నాయకులు ఖండిస్తున్న తను తన ధోరణిని మార్చుకోనని మంత్రి తేల్చి చెప్పారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube