సంచలనం: జగన్ పై కేసు వాపస్ చేసుకున్న పోలీసులు..!!

అప్పట్లో 2014 ఎన్నికల సమయంలో జాతీయ రహదారిపై అనుమతులు లేకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని జగన్ పై కేసు నమోదు అవ్వటం తెలిసిందే.ఈ కేసును కోదాడ పోలీసులు అప్పట్లో నమోదు చేయడం జరిగింది.

 Kodhada Police Withdrawn The Case Against Ap Cm Jagan, Ys Jagan, Alla Srinivas R-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ కేసులో ఏ1గా జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వారందరిపై నమోదైన కేసులను కోర్టు  కొట్టివేయడం జరిగింది.ఈ క్రమంలో న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని జగన్ కి ఇటీవల నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు ఇవ్వడం మనకందరికీ తెలిసిందే.

ఇటువంటి తరుణంలో… అప్పట్లో కేసు నమోదు చేసిన కోదాడ పోలీసులు తాజాగా కేసును ఉపసంహరించుకోవడానికి రెడీ అవ్వడం జరిగింది.ఇదే విషయాన్ని  పోలీసులు కోర్టుకు తెలిపారు.ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొన్న వారి విషయంలో ఏది కూడా నిరూపితం కాలేదని, కాబట్టి ఈ కేసు వీగిపోయినట్టేనని కోర్టుకు సమర్పించిన పిటిషన్ లో పోలీసులు తెలిపారు.దీనిపై స్పందించిన కోర్టు ఈ కేసు పెట్టిన పిటిషనర్ ఎంపీడీవో ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

తాజా పరిణామంతో చాలా వరకు జగన్ పై ఉన్న ఈ కేసు వీగిపోయినట్టేనని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu Allasrinivas, Kodhada, Nampally, Withdrawn, Ys Jagan-Telugu Political New.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube