డాక్టర్లు అంటే దేవుళ్లతో సమానం అని అంతా నమ్ముతారు.వారు చేసే వృతి నిజంగా దేవుడు చేసే పని కంటే గొప్పదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రాణాలను కాపాడటంతో పాటు ప్రాణాలు పోయడం కూడా వారికే సాధ్యం.కాని కొన్ని సార్లు ఆ డాక్టర్లు నీచమైన పనులు చేస్తూ అత్యంత దారుణంగా ప్రవర్తించడం మనం ఈమద్య కాలంలో చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు ఉన్న కొందరు డాక్టర్లు తమ పేషంట్లను సరిగా పట్టించుకోక పోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు తీస్తున్నారు.తాజాగా తెలంగాణ రాష్ట్రం కోదాడలోని ఒక డాక్టర్ తన వద్ద పని చేసే నర్స్‌ను శారీరకంగా వాడుకుని ఆమెను వదిలించుకునేందుకు ప్రయత్నించాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… కోదాడ పట్టణంలోని అర్చన నర్సింగ్ హోమ్‌ను నిర్వహిస్తున్న డాక్టర్ భాస్కర్ రావు తాజాగా తన వద్ద నర్స్‌గా చేస్తున్న యువతిని లోబర్చుకున్నాడు.ఆమెతో గత కొన్నాళ్లుగా అక్రమ సంబంధం నెరుపుతున్నాడు.ఇటీవల ఆమె గర్బం దాల్చింది.దాంతో ఆమెను అబార్షన్ చేయించుకోమంటూ చెప్పాడు.కాని ఆమె మాత్రం అబార్షన్‌కు నో చెప్పింది.పెళ్లి చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేసింది.
కాని అతడు మాత్రం అందుకు ఒప్పుకోలేదు.అప్పటికే పెళ్లి అయిన తాను మరో పెళ్లి చేసుకోవడంకు వీలు లేదంటూ ఆ యువతికి ఒక ఆఫర్ ఇచ్చాడు.

తన వద్దకు చికిత్స కోసం వచ్చే వారికి మందులు రాసే చిట్టిపై భాస్కర్ రావు ఆ యువతికి రెండు లక్షల రూపాయల నగదు, 100 గజాల ప్లాటు, మూడు లక్షల విలువ చేసే బంగారం ఇస్తానంటూ రాసి ఇచ్చాడు.ఇది నా ఇష్టపూర్తిగా రాయించి ఇస్తున్నాను అంటూ కూడా చెప్పాడు.అయినా కూడా ఆమె తనకు జరిగిన అన్యాయం గురించి మీడియా ముందుకు వచ్చింది.తనను భాస్కర్ రావు మోసం చేశాడు అంటూ మీడియా ముందుకు వచ్చింది.దాంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది.ఇన్ని రోజులు కోదాడ పట్టణంలో ప్రముఖ డాక్టర్‌గా ఉన్న భాస్కర్ రావు పరువు పోయింది.
హాస్పిటల్ మూత పడ్డ పనైంది.ఆయన భార్య శేషుకుమారి కూడా అదే హాస్పిటల్‌లో గైనకాలజిస్ట్‌గా వ్యవహరించడం విశేషం.