మన్మధుడికి సంపూ చెమటలు పట్టిస్తున్నాడుగా  

Kobbari Matta Effect On Manmadhudu 2 Movie-

సంపూర్నేష్‌ బాబు ‘కొబ్బరిమట్ట’ సందడి మామూలుగా లేదు.సోషల్‌ మీడియాలోనే కాకుండా మాస్‌ జనాల వరకు కూడా కొబ్బరి మట్ట చిత్రం వెళ్లి పోయింది.సంపూర్నేష్‌బాబు చెప్పిన భారీ డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.కొబ్బరి మట్ట చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...

Kobbari Matta Effect On Manmadhudu 2 Movie--Kobbari Matta Effect On Manmadhudu 2 Movie-

కొబ్బరి మట్ట చిత్రం ఆగస్టు 10వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Kobbari Matta Effect On Manmadhudu 2 Movie--Kobbari Matta Effect On Manmadhudu 2 Movie-

దాదాపు రెండేళ్లుగా ఈ చిత్రం నాన్చుతూ వస్తున్నారు.ఈ చిత్రంలో సంపూర్నేష్‌బాబు మూడు పాత్రల్లో నటించడంతో పాటు, లెంగ్తీ డైలాగ్‌ చెప్పడం, కష్టమైన స్టెప్పులు వేయడం ఇంకా ఒక పాట పాడటం కూడా చేశాడు.మొత్తానికి సంపూర్నేష్‌బాబు ఈ చిత్రంతో ఒక స్టార్‌గా మారిపోవడం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.ఇదే సమయంలో కొబ్బరిమట్టకు ముందు రోజు రిలీజ్‌ కాబోతున్న మన్మధుడు 2 చిత్రం యూనిట్‌ సభ్యుల్లో టెన్షన్‌ పెరిగి పోతుంది.

ఒక వైపు అనసూయ ‘కథనం’ చిత్రంతో మన్మధుడు రాబోతున్న ఆగస్టు 9వ తారీకున రంగంలోకి దిగబోతుంది.అనసూయకు ఉన్న క్రేజ్‌తో ఆ సినిమా అంతో ఇంతో ఓపెనింగ్స్‌ను రాబట్టడం ఖాయం.

ఇక ఆ చిత్రం కాకుండా తెల్లారే విడుదల కాబోతున్న కొబ్బరి మట్ట చిత్రం ఖచ్చితంగా మన్మధుడు 2 చిత్రం కలెక్షన్స్‌ పై ప్రభావం చూపుతుందనే టెన్షన్‌లో నాగ్‌ అండ్‌ టీం ఉన్నట్లుగా తెలుస్తోంది.కొబ్బరి మట్ట చిత్రం వాయిదా వేయించే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.