సంపూ సౌండ్ కి మన్మథుడు డౌన్?  

Kobbari Matta Turning Out To Be A Success-

పెద్దగా అంచనాలు లేకుండా గత శనివారం రిలీజైన సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట బాక్స్ ఆఫీస్ వద్ద మంచి లాభాలతో దూసుకుపోతోంది.పోటీగా మన్మథుడు 2 ఉన్నప్పటికీ హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో మాస్ ఏరియాల్లో హంగామా చేస్తోంది.పైగా చిత్ర యూనిట్ ఆడియెన్స్ వద్దకు వెళుతుండడంతో సినిమా ప్రమోషన్ డోస్ కూడా పెరుగుతోంది...

Kobbari Matta Turning Out To Be A Success--Kobbari Matta Turning Out To Be A Success-

ఇప్పటికే సినిమాకు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది.శనివారం డీసెంట్ గా స్టార్ట్ అయినప్పటికీ ఆదివారం ఊహించని విధంగా డబుల్ ప్రాఫిట్స్ లోకి వచ్చినట్లు సమాచారం.

కొబ్బరిమట్ట దెబ్బకు కింగ్ నాగార్జున మన్మథుడు 2 కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి.శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఫస్ట్ డే డీసెంట్ గా షేర్స్ అందుకున్నప్పటికీ శని ఆదివారాల్లో ఒక్కసారిగా డౌన్ అయ్యాయి..

Kobbari Matta Turning Out To Be A Success--Kobbari Matta Turning Out To Be A Success-

సినిమాలో కాస్త రొమాన్స్ ఘాటు ఎక్కువవడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ అటు వైపు చూడడం లేదు.చాలా వరకు కొన్ని సీన్స్ రొటీన్ గా గా అనిపించినట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది.అయితే సినిమా ఎక్కడానికి కాస్త సమయం పడుతుందని నాగ్ చెప్పినప్పటికీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పడం కష్టమే.