మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ డే టాక్ తో సంబంధం లేకుండా భారీగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.పుష్ప ది రైజ్, అఖండ సినిమాలలా నెగిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా పుంజుకుంటుందని మహేష్ బాబు ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రకు సైతం మంచి మార్కులు పడ్డాయనే సంగతి తెలిసిందే.
మాస్ రోల్ లో కీర్తి సురేష్ అదుర్స్ అనిపించారు.అయితే ఈ సినిమాలో కొన్ని నిమిషాలే కనిపించినా కీర్తి సురేష్ ఫ్రెండ్ రోల్ లో కనిపించిన అమ్మాయి తన నటనతో మెప్పించింది.
ఈ నటి పేరు సౌమ్యా మీనన్ అని సమాచారం.మలయాళ, కన్నడ సినిమాలలో నటిస్తూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సౌమ్య సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు.
సర్కారు వారి పాట సినిమా ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు సౌమ్యా మీనన్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోందని సమాచారం.ఈ బ్యూటీ తెలుగులో లెహరాయి అనే సినిమాలో నటిస్తున్నాని తెలుస్తోంది.
ఈ సినిమా సక్సెస్ సాధిస్తే సౌమ్య మీనన్ కెరీర్ విషయంలో బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.సౌమ్య మీనన్ కు ఇన్ స్టాగ్రామ్ లో దాదాపుగా 1,89,000 మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
టాక్సీ అనే మరో తెలుగు మూవీకి కూడా ఈ బ్యూటీ ఓకే చెప్పారని తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతలు గత కొన్నేళ్లుగా టాలెంట్ ఉన్న హీరోయిన్లను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.సౌమ్యా మీనన్ కు కూడా అదే తరహాలో ఆఫర్లు వస్తాయేమో చూడాలి.ఇప్పటికే పలువురు మలయాళ హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటడంతో పాటు స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలుగుతున్నారు.