మహాలయ అమావాస్య ఎప్పుడు.. ఆ రోజు ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షం ప్రారంభమవుతుంది.పౌర్ణమి రోజు మహాలయ పక్షం ప్రారంభం కాగా అమావాస్యతో ముగుస్తుంది.

 Know When Is Sarva Pitri Amavasya And The Importance Of Performing Shradh-on This Day Pitru Paksham, Pitru Tarpanam,pitru Devo Bava, Mathru Devo Bava, Oct 5 Th-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ 15 రోజులను ఎంతో పవిత్రమైన రోజులుగా పితృ పక్షాలుగా భావిస్తారు.ఈ పదిహేను రోజులలో చనిపోయిన మన పూర్వీకులకు శ్రాద్ధం పెట్టడానికి ఎంతో అనుకూలమైన రోజులుగా చెప్పవచ్చు.

ఇలా పౌర్ణమి రోజు మొదలైన ఈ పితృ పక్షాలు అమావాస్య రోజున ముగుస్తాయి.మరి బాద్రపద మహాలయ అమావాస్య ఎప్పుడు వస్తుంది.

 Know When Is Sarva Pitri Amavasya And The Importance Of Performing Shradh-on This Day Pitru Paksham, Pitru Tarpanam,pitru Devo Bava, Mathru Devo Bava, Oct 5 Th-మహాలయ అమావాస్య ఎప్పుడు.. ఆ రోజు ప్రాముఖ్యత ఏమిటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రోజు ఏ విధమైనటువంటి నియమాలను పాటించాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఈ భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య లేదా సర్వ ప్రీతి అమావాస్య అని కూడా పిలుస్తారు.

పూర్వ కాలం నుంచి ఈ అమావాస్యను రోజును శ్రాద్ధానికి చివరిరోజుగా నమ్ముతారు.ఈ సర్వ పితృ అమావాస్యనాడు మనకు తెలిసిన, తెలియని పూర్వీకుల కోసం శ్రాద్ధం నిర్వహించడం ప్రత్యేకం.

 అయితే చాలా మందికి వారి పూర్వీకులు లేదా పెద్దవారు ఎప్పుడు మరణించారో ఆ తేదీ తెలిసి ఉండదు.అలాంటి వారు సర్వ ప్రీతి అమావాస్యరోజు వారికి శార్థం పెట్టడం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగు తుందని పండితులు చెబుతున్నారు.

మన ధర్మం ప్రకారం చనిపోయిన పూర్వీకులు ఈ పితృపక్షంలో భూమి పైకి వస్తారని వారి ఆత్మ సంతృప్తి చెంది తిరిగి స్వర్గలోకానికి వెళ్లాలని పిత్రు పక్షంలో వారికి శ్రాద్ధం పెడతాము.మరి ఈ ఏడాది అమావాస్య అక్టోబర్ 6వ తేదీ వచ్చింది.ఈరోజు సర్వ పితృ అమావాస్య కు ఎంతో అనువైన రోజు.పంచాంగం ప్రకారం మహాలయ అమావాస్య అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 07:04 నుంచి ప్రారంభమై అక్టోబర్ 6వ తేదీ సాయంత్రం 4:35 వరకు ఉంటుంది.అక్టోబర్ 6వ తేదీ అమావాస్య తిథి సూర్యోదయం కావడం వల్ల సర్వ పిత్రు అమావాస్యను ఆరవ తేదీగా పరిగణిస్తారు.ఈ రోజు చనిపోయిన వారికి శ్రాద్ధం నిర్వహిస్తే వారి ఆత్మ లకు మోక్షం దక్కుతుంది.

ఈ పదిహేను రోజులు సంతాప దినాలుగా పరిగణిస్తారు కనుక ఇంట్లో ఏ విధమైనటువంటి శుభకార్యాలు, కొత్త వస్తువులు గృహాలు కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

Know When Is Sarva Pitri Amavasya And The Importance Of Performing Shradh-on This Day Pitru Paksham, Pitru Tarpanam,pitru Devo Bava, Mathru Devo Bava, Oct 5 Th - Telugu Oct, Pitru Devo Bava, Pitru Paksham, Pitru Tarpanam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube