కడుపులో ఎటువైపు నొప్పి ఉంటే ఏ సమస్యకి సంకేతమో చూడండి  

Know Types Of Stomach Pains And How They Differ-

 • కడుపు నొప్పితో బాధపడేవారు చాలామందే. కాని కడుపులో ఎక్కడ నొప్పి వేసిన దాన్ని కడుపు నొప్పి అని సింపుల్ గా చెప్పేస్తారు.

 • కడుపులో ఎటువైపు నొప్పి ఉంటే ఏ సమస్యకి సంకేతమో చూడండి-

 • కడుపు నొప్పిలో కూడా రకరకాల సమస్యలు ఉంటాయి. నాభి దగ్గర నొప్పి వేస్తే వేరే సమస్యలు ఉంటాయి, నాభి కింద నొప్పి వేస్తే వేరే సమస్యలు ఉన్నట్లు.

 • ఈ తేడా చాలామందికి తెలియదు. అందుకే కడుపులో ఎటువైపు నొప్పి వేస్తే ఏ సమస్యలు ఉన్నట్లో చెప్తున్నాం చూడండి.


 • పాంక్రీటిటిస్ లాంటి సమస్య కూడా అయి ఉండవచ్చు.

  * నాభికి కుడివైపు నొప్పి ఉంటే అది కిడ్నీల్లో రాళ్ళకి, యూరీన్ ఇంఫెక్షన్, మలబద్దకం, లంబర్ హెర్నియా లాంటి సమస్యలకి దారి తీస్తుంది.


 • * నాభికి ఎడమవైపు నొప్పిగా ఉంటే, కిడ్నీల్లో రాళ్ళు, మలబద్ధకము, మంటగా ఉండే బావెల్, డైవర్టికులర్ డీసీజ్ లాంటి సమస్యల వలన అయి ఉండవచ్చు.

  * నాభి పైన ప్రాంతంలో నొప్పి కడుపులో అల్సర్, హార్ట్ బర్న్, అజీర్ణం, గాల్ స్టోన్స్, ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా లాంటి సమస్యలను సూచిస్తుంది.


 • * నాభికి కింది భాగంలో నొప్పి, యూరీన్ ఇంఫెక్షన్, అపెండెసిటిస్, పెల్విక్ పెయిన్, డైవర్టికులర్ డిసీజ్ లకి సంకేతం.

  * నాభికి పైన కుడిభాగంలో నొప్పి ఉంటే, గాల్ స్టోన్స్, కడుపు అల్సర్, పాంక్రీటిటిస్ వంటి సమస్యలు ఉండవచ్చు.


 • * నాభికి పైన ఎడమభాగంలో నొప్పి కడుపు అల్సర్ లేదా పాంక్రిటిటిస్, లేదా డ్యుయోడెంటల్ అల్సర్ వలన కావచ్చు.

  * నాభి కింద కుడిభాగంలో నొప్పి అపెండిసిటిస్, మలబద్ధకము, పెల్విక్ పేయిన్ సమస్యలకి సూచన.


 • * నాభి కింద ఎడమవైపుకు నొప్పి ఉంటే, పెల్విక్ పేయిన్, డైవర్టికులర్ డిసీజ్, గ్రొయిన్ పేయిన్ వచ్చి ఉండవచ్చు.