ఏ క్రికేటర్ ఎక్కడివరకు చదువుకున్నాడో తెలుసా?

మన స్టార్ క్రికేటర్లు పుట్టడంతోనే బ్యాట్ పట్టుకోలేదు కదా.అందరు మనలాగే బలపాలు పట్టినవారే.

 Know The Educational Qualifications Of Indian Cricketers Here-TeluguStop.com

అయితే ఒకానొక సమయంలో, తమ టాలెంట్ ని గుర్తించి చదువులకు టాటా బైబై చెప్పేసి, భారతదేశం కోసం ఆడటమే తమ లక్ష్యంగా సాధన మొదలుపెట్టారు.ఇందులో MBBS దాకా చదివిన క్రికేటర్ ఉన్నాడు, అలాగే పదొవ తరగతిలోనే పుస్తకాలు మూసేసిన ఆటగాడు కూడా ఉన్నాడు.

ఓ లుక్కేసి తెలుసుకోండి ఎవరు ఎక్కడిదాకా చదివారో !

* 16 ఏళ్ళ ప్రాయంలోనే జాతీయ జట్టులోకి వచ్చిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శార్దాశ్రమ్ విద్యమందీర్ లో 12వ తరగతి వరకు చదవుకున్నాడు.

* భారత క్రికేట్ తలరాతనే మార్చేసిన నాయకుడు సౌరవ్ గంగూలి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు.

* జాతీయ జట్టులోకి అవకాశం వచ్చినప్పుడు రాహుల్ ద్రావిడ్ MBA చేస్తు మధ్యలోనే వదిలేసాడు.

* లెజెండరి స్పిన్నర్, ప్రస్తుతం జాతీయ జట్టు కోచ్ అయిన అనీల్ కుంబ్లే BE డిగ్రీ పూర్తి చేసాడు.

* స్టైలీష్ బ్యాట్స్‌మన్, మన హైదరాబాది వివిఎస్ లక్ణ్మణ్ ఏకంగా MBBS చేస్తూ క్రికేట్ కోసం వదిలేసాడు.

* భారత జట్టు మాజీ ఓపెనర్, విధ్వంసక బ్యాట్స్‌మన్ విరేందర్ సెహ్వాగ్ కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు.

* భారత వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 12వ తరగతి పూర్తి చేసి, ఇంకా B.com డిగ్రీలో ఆగిపోయి ఉన్నాడు.

* ప్రపంచ క్రికేట్ సంచలనం, భారత టెస్టు జట్టు కెప్టెన్, విరాట్ కొహ్లీ 12వ తరగతి పూర్తి చేసాక చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసాడు.

* సురేష్ రైనా హై స్కూల్ లోనే చదువు మానేస్తే, అజింక్యా రహానే, శిఖర్ ధవన్ టెన్త్ పూర్తి చేసారు.

* గౌతమ్ గంభీర్ గ్రాడ్యుయేషన్ , రోహిత్ శర్మ హై స్కూల్, జహీర్ ఖాన్ మరియు రవిచంద్రన్ అశ్విన్ ఇంజనీరింగ్ దాకా చదివారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube