మీ చేతిలో ఇలాంటి గీతలు ఉంటే వివాహం జరగడం కష్టమే...!

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో అపురూపమైన ఘట్టం.కానీ కొందరికి మాత్రం వివాహ గడియలు చాలా ఆలస్యంగా ఉంటాయి.

 Know Love Will Succeed Or Fail According To Palmistry,love, Marriage, Palmistry,-TeluguStop.com

ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరదు.కొందరు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే మరికొందరు ప్రేమ వివాహం చేసుకుంటారు.

ప్రేమ మన కంటికి కనిపించక పోయినా ప్రతి ఒక్కరి విషయంలో ఏదో ఒక సమయంలో ప్రేమ అనేది కలుగుతుంది.కానీ ప్రేమించిన వాళ్ళు అందరూ పెళ్లిళ్లు చేసుకోవడం చాలా అరుదు.

అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే మన హస్త రేఖలు ఒకసారి గమనించాల్సింది.

జ్యోతిష్య శాస్త్రము లో హస్త రేఖా శాస్త్రం ఎంతో ప్రాముఖ్యత కలిగినది.

అరచేతిలోని రేఖలను బట్టి జ్యోతిష్య నిపుణులు మన భవిష్యత్తును తెలియజేస్తుంటారు.హస్త రేఖా శాస్త్రం ప్రకారం మన అరచేతిలో వివాహ రేఖ మన చిటికెన వేలు కింది భాగంలో ఉంటుంది.

ఆ రేఖ ఎంత బలంగా ఉంటుందో మన వివాహ విషయంలో కూడా అంతే వేగంగా పనులు సాగుతాయి.చిటికెన వేలు కింది బాగాన బుద పర్వతం అనే రేఖ ఉంటుంది.

ఈ రేఖ పెరగడం వల్ల ప్రేమ విషయంలో విజయాన్ని సాధిస్తారు.

అంతే కాకుండా మన అరచేతిలో ఉంగరపువేలు కింద ఉన్న రేఖ సూర్య రేఖ వరకు వెళితే అలాంటి వారు సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పొందిన వ్యక్తిని వివాహం చేసుకుంటారు.

ఇదే సమయంలో ఎవరైతే ప్రేమించుకొని ఉంటారో వారి ప్రేమలో విజయాన్ని సాధించి ప్రేమ వివాహం చేసుకుంటారు.ఇలాంటి వారి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది.

హస్తరేఖా ప్రకారం బుధ పర్వతంపై వివాహ రేఖ ప్రారంభదశలోనే రెండు చీలికలుగా విడిపోతే అలాంటి వారి జీవితంలో వివాహ బంధం కూడా విడిపోయే ప్రమాదాలు ఏర్పడతాయి.ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు, విభేదాలు మనస్పర్ధలు రావడం వల్ల జీవితంలో గొడవలు పడి చివరకు విడాకుల వరకు దారి తీస్తుంది.బుధ పర్వత రేఖ ప్రారంభ దశలో ఎప్పుడూ కూడా రెండు చీలికలుగా ఏర్పడి ఉండకూడదని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Know Love Will Succeed Or Fail According To Palmistry,love, Marriage, Palmistry, Hindu Believs, Astrology - Telugu Astrology, Hindu Believs, Love, Palmistry

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube