రాగల 24 గంటల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?... ఈ సమాచారాన్ని ఆ శాఖ ఎలా తెలుసుకుంటుందో తెలిస్తే..

వాతావరణంలో చోటుచేసుకోబోయే మార్పుల గురించి ముందుగానే మనకు వాతావరణ శాఖ తెలియజేస్తుంది.వర్షాలు కురిసే అవకాశం ఉన్నా, ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నా.

 If You Know How The Meteorological Department Knows That Information Rains Air T-TeluguStop.com

రానున్న రోజుల్లో ఏం జరగబోతోందో కూడా వాతావరణ శాఖ ముందుగానే చెబుతుండటం మనం చూస్తుంటాం.వాతావరణంలోని మార్పులు, సూచనలకు అనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ.

తమ పనులను ప్లాన్ చేసుకోగలుగుతారు.నేటి సాంకేతిక యుగంలో వాతావరణ శాఖ ఖచ్చితమైన అంచనాలను అందించేందుకు ప్రయత్నిస్తుంటుంది.

అయితే ఈ వివరాలను వాతావరణ శాఖ ఎలా తెలుసుకుంటుందో మీకు తెలుసా? గార్గి కళాశాల రూపొందించిన నివేదిక ప్రకారం.వాతావరణంలో మార్పు అనేది ఒక ప్రదేశం లేదా ఆ సమయంలో గాలి యొక్క స్థితిని అనుసరించి ఉంటుంది.

ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.

అయితే గాలి పరిస్థితుల ద్వారా వాతావరణాన్ని అంచనా వేయడం సవాలుతో కూడుకున్న పని.వివిధ పరిస్థితులపై సేకరించిన డేటా ఆధారంగా వాతావరణ అంచనా ప్రక్రియ జరుగుతుంది.ఆ డేటాను అధ్యయనం చేసి అంచనాలు వేస్తారు.

వాతావరణ అంచనా అనేది ప్రస్తుతమున్న పరిస్థితి.

దాని మార్పుల యొక్క పరిమాణాత్మక డేటా యొక్క విశ్లేషణ.డేటాను సేకరించే సమయంలో భూమి పరిశీలన, రేడియో సౌండ్, డాప్లర్ రాడార్, ఉపగ్రహం మొదలైనవి సహకరిస్తాయి.ఈ సమాచారం వాతావరణ కేంద్రానికి పంపిస్తారు.

అక్కడ శాస్త్రవేత్తలు ఈ డేటా ఆధారంగా అంచనాలు వేస్తారు.హై-స్పీడ్ కంప్యూటర్లు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి.

డేటా, ఈ మ్యాప్‌ల ద్వారా అంచనాలు రూపొందిస్తారు.వాతావరణంలోని ఉష్ణోగ్రత, పీడనం, తేమ మొదలైనవాటిని గాలుల దిశ ద్వారా తెలుసుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube