గూగుల్ కుకీస్ గురించి తెలుసా? అవి క్లియర్ చేస్తే జరిగేది ఇదే!

ఏ క్షణాన జియో విప్లవం మొదలయ్యిందో గాని, అప్పటినుండి మొబైల్ డేటా మనకు అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది.దాంతో ప్రతిఒక్కరు ఇంటర్నెట్ ని వినియోగిస్తున్నారు.

 Know About Google Cookies This Is What Happens When They Clear! Google Cookies,-TeluguStop.com

ఈ క్రమంలో గూగుల్ వాడకం అనేది ప్రతీ ఇంట్లో పెరిగింది.వార్తలు చదవడం నుండి సినిమాలు చూడటం వరకు ఇపుడు అందరు ఇంటర్నెట్ నే ఆశ్రయిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రైవసీ కూడా ప్రధాన సమస్యగా మారిందని చెప్పాలి.ఈ క్రమంలో యూజర్లకు అనేక సందేహాలు ఉన్నాయి.

అలాంటి సందేహాల్లో ముఖ్యమైనది గూగుల్ కుకీస్.అవును.

గూగుల్ కుకీస్ అంటే ఏంటీ అని చాలామందికి ఓ డౌట్ ఉంది.

గూగుల్ కుకీస్ అనేవి మీరు సందర్శించే వెబ్‌సైట్‌ల ద్వారా సృష్టించిన ఫైల్స్ అని చెప్పుకోవాలి.

బ్రౌజింగ్ సమాచారాన్ని సేవ్ చేయడం వల్ల మీరు మరలా అదే సైట్ ని విజిట్ చేసినపుడు చాలా ఈజీగా అందులోకి వెళ్లగలుగుతారు.సైట్‌లు సైన్ ఇన్ చేసి ఉంచటానికి, మీ సైట్ ప్రాధాన్యతలను గుర్తుంచుకోగలగటానికి, స్థానికంగా సంబంధిత కంటెంట్‌ను అందించటానికి ఈ కుకీస్ అనేవి బాగా ఉపయోగపడతాయి.

ఒక్కోసారి పెర్ఫార్మన్స్ స్లో గా ఉంటే గనుక వీటిని క్లియర్స్ చేసుకోవాల్సి ఉంటుంది.

Telugu Google, Ups-Latest News - Telugu

అయితే, ఇక్కడ ఓ సమస్య ఏమంటే, అలా క్లియర్ చేస్తే గనుక వెబ్ బ్రౌజింగ్ అంత సౌకర్యవంతంగా ఉండదు.సైట్ ప్రాధాన్యతలన్నీ పూర్తిగా తొలగిపోయి స్లో అవుతాయి.మరలా లాగిన్ చేసుకోవలసి ఉంటుంది.

కుకీ డేటాను నిలిపివేసినా లేదా క్లియర్ చేసినా లాగిన్ సమాచారం, సూచనలు అన్ని క్లియర్ అవుతాయనే విషయం తెలిసినదే కదా.అయితే ‘పాస్‌వర్డ్‌లు ఇతర సైన్-ఇన్ డేటా’ ఫీల్డ్‌ కు ముందు చెక్‌ బాక్స్‌ ను చెక్ పెట్టకుండా కాషీని క్లియర్ చేస్తే గనుక కాష్ తో పాటు పాస్వార్డ్ లు క్లియర్ అవ్వవు.కుకీస్ వలన మనకు ఏ నష్టం ఉండదు అని ఇక్కడ గమనించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube