అధికారికంగా క‌రెన్సీ నోట్లు ముద్రించే ఆ సంస్థ‌ల గురించి మీకు తెలుసా?

నేడు ప్రపంచంలోని ప‌లు దేశాల కరెన్సీని మరొక దేశానికి చెందిన కంపెనీలు ముద్రిస్తుంటాయి.సురక్షితమైన కరెన్సీ ముద్రణ జరిగేలా మంచి సాంకేతికతను ఉపయోగించలేని చిన్న దేశాల జాబితా ఇందులో క‌నిపిస్తుంది.

 Know About Companies Who Print Currency India Landon Britan Printing,  Print Cur-TeluguStop.com

అనేక దేశాల కరెన్సీలను ఇతర దేశాలకు చెందిన‌ ప్రైవేట్ కంపెనీలు ముద్రిస్తున్నాయి.నేడు ఇది ఒక ప్రత్యేక వ్యాపారంగా మారింది.

ప్రపంచంలోని చాలా దేశాలు తమ ప్రభుత్వ ముద్రణ యంత్రాలతో తమ సొంత కరెన్సీని ప్రింట్ చేస్తున్నప్పటికీ.దీనికోసం ఉపయోగించే కాగితం, ఇంక్ కోసం ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డుతున్నాయి.

లండన్‌కు చెందిన డి లా ర్యూ పిఎల్‌సి కంపెనీ కరెన్సీ ప్రింటింగ్‌లో అగ్రగామిగా ఉంది.నేడు ప్రపంచంలోని 69 దేశాలు ఈ సంస్థ‌కు కస్టమర్‌లుగా ఉన్నాయి, ఈ సంస్థ కరెన్సీ నోట్లను ముద్రించే సాంకేతికతను అందిస్తోంది.

1861లో స్థాపించబడిన ఈ కంపెనీ నేడు సెక్యూరిటీ పేపర్లు, కరెన్సీ నోట్లు, ట్యాక్స్ స్టాంపులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఫుడ్ వోచర్‌లను ప్రింట్ చేస్తుంటుంది.యూరోపియన్ యూనియన్ కరెన్సీ ధృవీకరించబడిన ప్రింటర్లచే ముద్రిత‌మ‌వుతుంది.

అమెరికాలో అన్ని నోట్లను ముద్రించే బాధ్యత బ్యూరో ఆఫ్ ఎన్‌గ్రావింగ్ అండ్ ప్రింటింగ్‌కు అప్ప‌గించారు.అయితే అక్కడ నోట్ల కోసం పేపర్‌ను క్రేన్ కరెన్సీ అనే కంపెనీ సిద్ధం చేస్తుంది.

Telugu America, Britan, Currency, India, Print Currency, Security India-Latest N

అమెరికాలో మొట్టమొదటి కరెన్సీ నోటు 1861 సంవత్సరంలో ముద్రిత‌మ‌య్యింది.నోట్ల ముద్రణలో, సాంకేతికతలో, పద్ధతుల్లో పెను మార్పులు వచ్చాయి.బ్రిటన్‌లో.బ్యాంక్‌నోట్ డి లా ర్యూ కంపెనీ నోట్లను ముద్రిస్తుంటుంది.సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే భారత ప్రభుత్వ సంస్థ మ‌న దేశంలోని క‌రెన్సీని ముద్రిస్తుంటుంది.ప్రపంచంలోనే అతిపెద్ద నోట్ల ముద్రణ సంస్థ చైనాదే.

ఇక్కడ ఈ పనిని బ్యాంక్ నోట్ ప్రింటింగ్, మింటింగ్ కార్పొరేషన్ చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube