టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపిక..

టీమిండియా టెస్ట్ వైస్‌కెప్టెన్‌ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.రోహిత్ గాయాలపాలైన మరుక్షణమే అతడి స్థానంలో ప్రియాంక్ పంచల్ ని నియమించింది బీసీసీఐ.

 Kl Rahul Selected As Team India Vice Captain Team India, Vice Captain, Kl Rahul,-TeluguStop.com

కానీ టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్‌ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే విషయంపై చాలా రోజులు ఆలోచన చేసింది.ఈ క్రమంలో కే.

ఎల్.రాహుల్, అజింక్య రహానె, రిషబ్ పంత్, ఛతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు వినిపించాయి.అయితే వీరందరిలో ముందుగా ఊహించినట్టుగానే కేఎల్‌ రాహుల్‌ను వైస్‌కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ.ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

తాత్కాలిక వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్న రాహుల్‌ ఇప్పటిదాకా 40 టెస్టులు ఆడాడు.మొత్తంగా సుమారు 35 సగటు స్ట్రైక్ రేటుతో 2321 పరుగులు చేసి తన సత్తా చాటాడు.

అయితే డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్‌లో కేఎల్ రాహుల్‌ ఓపెనర్ గా టీమిండియా ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయనున్నాడు.ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సిఫార్సుల మేరకు వైస్‌కెప్టెన్‌గా రాహుల్‌ను సెలెక్ట్ చేసినట్టు బీసీసీఐ శనివారం రోజు తెలిపింది.

రోహిత్ శర్మ గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ నుంచి కూడా తొడ కండరాల గాయంతోనే వైదొలిగాడు.ఈసారి కూడా తొడ గాయం కావడం గమనార్హం.

ప్రస్తుతం నేషనల్ అకాడమీ లో ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న రోహిత్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉంది.

Telugu Kl Rahul, Latest, India-Latest News - Telugu

దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ఎంపికైన భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ప్రియాంక్ పంచల్, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మొహమ్మద్.షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, ఎండీ సిరాజ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube