కేఎల్‌ రాహుల్‌ చేసిన ఈ పనికి ఏకంగా అంపైర్‌ ప్రశంసించారు..! ఏమైందో తెలుస్తే ఫిదా అవ్వాల్సిందే!  

  • వరుసగా ప్రతి మ్యాచ్‌లో విఫలమవుతున్న కేఎల్ రాహుల్ క్రీడా స్ఫూర్తికి అందరూ ఫిదా అయిపోయారు. నిన్న మొన్నటి వరకూ తన ఆటతో విపరీతమైన విమర్శలు పాలైన రాహుల్‌ తాజాగా ప్రశంసించబడటానికి అతని నిజాయితీనే కారణం. రాహుల్ పట్టిన ఒక క్యాచ్‌ విషయంలో అతను క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడంతో ఒక్కసారిగా ‘సీన్‌’ మారిపోయింది.

  • KL Rahul Earns Praise For Sportsmanship In Sydney Test-Harris Batting Kl Sportsmanship Test

    KL Rahul Earns Praise For Sportsmanship In Sydney Test

  • మూడో రోజు ఆటలో రవీంద్ర జడేజా వేసిన మొదటి బంతికే ఆసీస్ ఓపెనర్ హారిస్ మిడ్ ఆన్ దిశగా షాట్ కొట్టాడు. అది నేరుగా రాహుల్ వైపు వెళ్లింది. వెంటనే డైవ్ చేసి అద్భుతంగా రాహుల్ బంతి పట్టుకున్నాడు. అంతా హారిస్ అవుట్‌గా భావించారు. కానీ రాహుల్ మాత్రం బంతి నేలను తాకిందని, అవుట్ కాదంటూ చేతులతో సిగ్నల్స్ ఇచ్చాడు. దీంతో ఆటగాళ్లతో పాటు మైదానంలో ఉన్న ప్రేక్షకులంతా రాహుల్ నిజాయతీకి ఫిదా అయ్యారు. చివరికి ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ కూడా ‘శభాష్ రాహుల్ కీప్ ఇట్ అప్’ అంటూ ప్రశంసించాడు. ఆ వీడియో ట్విట్టర్ లో షేర్ చేయగా వైరల్ అయ్యింది.

  • KL Rahul Earns Praise For Sportsmanship In Sydney Test-Harris Batting Kl Sportsmanship Test
  • రాహుల్‌ క్రీడాస్ఫూర్తికి పలువురు క్రికెట్‌ అభిమానులు కూడా ఫిదా అయ్యారు. రాహుల్‌ తన నిజాయతీని చాటుకున్నాడంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘రాహుల్‌ క్రీడా స్ఫూర్తి మిగతా ఆటగాళ్లకు అనుసరణీయం’ అని ఒక అభిమాని ప్రశంసించగా, ‘చీటింగ్‌కు పాల్పడే ఆటగాళ్లు రాహుల్‌ నుంచి ఎంతో నేర్చుకోవాలి’ అని మరొకరు పేర్కొన్నారు. ‘అంపైర్‌ సమయాన్ని వృథా చేయకుండా వెంటనే రాహుల్‌ స్పందించడం నిజంగా గ్రేట్‌’ అని మరొక అభిమాని కొనియాడాడు. ఇలా రాహుల్‌ విమర్శల బాట నుండి ప్రశంసలు అందుకోవడం టీమిండియా శిబిరంలో జోష్‌ నింపింది.

  • watch video: https://twitter.com/cricketcomau/status/1081338419425337344