ఆ అంపైర్ గొడవేసుకున్న కేఎల్ రాహుల్..!

రోజురోజుకూ ఐపిఎల్ మ్యాచ్ లు రసవత్తరంగా మారుతున్నాయి.ఎవరు టైటిల్ గెలుస్తారోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 Kl Rahul Clashed With The Umpire ..! Empire, Fight, Kl Rahul, Social Media, Vira-TeluguStop.com

ఐపీఎల్ 2021లో ఆదివారం పంజాబ్ కింగ్స్ టీమ్ కు రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు కు మధ్య కీలక మ్యాచ్ జరిగింది.మ్యాచ్ లో ఓ వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది.

బెంగళూరు బ్యాటింగ్ చేస్తుండగా దేవ్‌దత్ పడిక్కల్‌ను అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.దీంతో ఆ డెషిసన్ వివాదాస్పదమైంది.

పంజాబ్ బౌలర్ రవి బిష్ణోయ్ 8వ ఓవర్‌ వేస్తున్నప్పుడు బ్యాటింగ్ చేస్తున్న దేవ్‌దత్ పడిక్కల్ లెగ్‌సైడ్ పడిన బంతిని కనెక్ట్ చేయలేకపోవడంతో ఈ ఘటన జరిగింది.

బిష్ణోయ్, కీపర్ కేఎల్ రాహుల్ అది కచ్చితంగా అవుటేనని అప్పీల్ చేయడంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ నాటౌట్ గా ప్రకటించాడు.

అయితే కేఎల్ రాహుల్ మాత్రం డీఆర్ఎస్‌కు వెళ్లాడు.టీవీ అంపైర్ చాలా సార్లు పరిశీలించాడు.అయినప్పటికీ ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన డెషిషన్‌నే కన్ఫార్మ్ చేయడంతో టీవీ రీప్లేలో బాల్ గ్లౌవ్‌ కు తాకింది.

Telugu Empire, Kl Rahul, Latest-Latest News - Telugu

ఆ సమయంలో చిన్న స్పైక్ కూడా కనపడింది.అయినప్పటికీ టీవీ అంపైర్ నాటౌట్‌ ఇచ్చాడు.దీంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ తీవ్రంగా కోపోద్రిక్తుడయ్యాడు.

అవుటైనా కూడా నాటౌట్‌ గా ఇవ్వడంతో దేవ్‌దత్ పడిక్కల్ మళ్లీ బ్యాటింగ్ చేపట్టాల్సి వచ్చింది.అంతేకాదు పంజాబ్ కింగ్స్ జట్టుకు ఉన్నటువంటి ఒకే ఒక రివ్యూ కూడా పోయినట్లైంది.

ఆ తర్వాత కేఎల్ రాహుల్ కు అంపైర్ పద్మనాభన్ కు మధ్య చాలా సమయం చర్చ జరగడంతో ఆటగాళ్లంతా అలర్ట్ అయ్యారు.అంత క్లియర్‌ గా స్పైక్ కనిపిస్తున్నప్పటికీ నాటౌట్ ఇవ్వడం ఏంటని రాహుల్ నిలదీయడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

థర్డ్ అంపైర్ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.న్యూజీలాండ్ మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత స్కాట్ స్టైరిష్ కూడా ఫైర్ అయ్యాడు.

థర్డ్ అంపైర్‌ ను వెంటనే పీకేయండని ఘాటుగా ట్వీట్ చేయడం చర్చనీయాంశమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube