సచిన్ రికార్డుని బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్…!  

ipl, ipl 2020 , kl rahul, rcb, kxip, delhi captials, sachin - Telugu Delhi Captials, Ipl, Ipl 2020, Kl Rahul, Kxip, Rcb, Sachin

తాజాగా యూఏఈ దేశంలో జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా గత రాత్రి జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పోరులో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 97 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

TeluguStop.com - Kl Rahul Breaks Sachins Record

అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎలాంటి పోటీ ఇవ్వకుండానే మ్యాచ్ ఓడిపోయింది.కేవలం 17 ఓవర్లలోనే 109 పరుగులకు రాయల్ చాలెంజర్స్ జట్టు ఆల్ అవుట్ అయిపోయింది.

ఇక ఇది ఇలా ఉండగా మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కె.ఎల్.రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు.కేవలం 69 బంతుల్లో 14 ఫోర్లు 7 సిక్సర్లతో \ 132 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

TeluguStop.com - సచిన్ రికార్డుని బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్…-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇదే క్రమంలో రాహుల్ ఐపీఎల్ లో ఓ రికార్డు సాధించాడు.అయితే తాజాగా జరిగిన మ్యాచ్ లో కేవలం రెండు పరుగులు చేసిన సమయంలోనే కె.ఎల్.రాహుల్ రెండు వేల పరుగుల మార్కును చేరుకున్నాడు.అయితే రెండు వేల మార్కును అత్యంత వేగంగా చేసిన రికార్డు టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరు పై ఉండేది.తాజా మ్యాచ్ తో ఆ రికార్డును రాహుల్ తన పేరుపై లిఖించాడు.2000 మార్క్ ను సాధించడానికి సచిన్ టెండూల్కర్ మొత్తం 63 ఇన్నింగ్స్లు ఆడగా కేఎల్ రాహుల్ మాత్రం 60 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనతను సాధించాడు.

ఇకపోతే కె.

ఎల్.రాహుల్ తాజాగా చేసిన సెంచరీతో ఐపీఎల్ సీజన్ లో మొట్టమొదటి సెంచరీని నమోదు చేశాడు.గత మ్యాచుతో కేఎల్ రాహుల్ ఐపీఎల్ కెరియర్ లో 60 ఇన్నింగ్స్ లలో 2130 పరుగులను సాధించాడు.ఇందులో మొత్తం 16 హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి.

కేఎల్ రాహుల్ గత సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచకప్ నుండి ఫుల్ ఫామ్ లో కనపడుతున్నాడు.ఐపీఎల్ లో మొదటి మ్యాచ్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడిన సమయంలో కేఎల్ రాహుల్ తక్కువ స్కోరుకే అవుట్ అయ్యి నిరుత్సాహపరిచినా, రెండో మ్యాచ్ లో మాత్రం తన మార్క్ ను చూపించాడు.

మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు సూపర్ ఓవర్ లో కేవలం రెండు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను చేజార్చుకుంది.

#Sachin #KXiP #Ipl 2020 #KL Rahul #Delhi Captials

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kl Rahul Breaks Sachins Record Related Telugu News,Photos/Pics,Images..