దీర్ఘకాలిక వ్యాధుల్లో `ఉబ్బసం` ఒకటి.శ్వాసకోశ వ్యాధి అయిన ఈ ఉబ్బసం నేటి కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మందిని పట్టి పీడిస్తుంది.
ఉబ్బసం వ్యాధి ఉన్న వారు తరచూ ఆయాసం, పిల్లి కూతలు, ఊపిరి అందకపోవడం, దగ్గు, ఛాతీ పట్టి నట్లుగా ఉండడం వంటి సమస్యలతో బాధ పడుతుంటారు.ఉబ్బసం పూర్తి నివారణకు చికిత్స లేకపోయినా.
అదుపు చేసే మందులు మాత్రం అందుబాటులో ఉన్నాయి.అందుకే ఉబ్బసం వ్యాధి గ్రస్తులు మందులు వాడుతూ.
ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
అయితే ఉబ్బసం వ్యాధిని అదుపు చేయడంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.
అలాంటి వాటిలో కివి పండు కూడా ఒకటి.చూసేందుకు సపోటా పండులా ఉండే కివి పండు.
తినేందుకు రుచిగా ఉండటంతో పాటు పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.విటమిన్ ఎ, విటమిన్ సి, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు కివి పండులో నిండి ఉంటాయి.
అందుకే కివి పండు డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు.
ముఖ్యంగా ఉబ్బసం వ్యాధి గ్రస్తులు కివి పండు తీసుకుంటే చాలా మంచిది.కివి పండులో అత్యధికంగా ఉండే విటమిన్ సి మరియు ఇతర పోషకాలు.శ్వాసకోశ వ్యవస్థ సజావుగా పని చేసేందుకు సహాయపడతాయి.
మరియు ఉబ్బసం వల్ల వచ్చే ఆయాసం, పిల్లి కూతలు, దగ్గు వంటి లక్షణాలను నివారిస్తాయి.అందుకే ఉబ్బసం ఉన్న వారు ప్రతి రోజు ఒక కివి పండును తీసుకోమని సూచిస్తున్నారు.
ఇక కివి పండు తీసుకుంటే.వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు.కివి పండులో ఫైబర్ ఎక్కువగా.కేలరీలు తక్కువగా ఉంటాయి.
అందువల్ల, క్రమం తప్పకుండా కిండు పండును తీసుకుంటే.బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.
కిండి పండు డైట్‌లో చేర్చుకోవడం వల్ల.కంటి చూపు సైతం మెరుగు పడుతుంది.