సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన ఒక వీడియో( Viral Video ) ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది.ఇందులో చలితో వణుకుతున్న ఒక పిల్లిని( Freezing Cat ) చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, దానిని కాపాడాలని ప్రయత్నిస్తున్న ఒక చిన్నారిని చూడవచ్చు.
చైనాకు( China ) చెందిన ఈ బాలిక పిల్లిని వెచ్చగా ఉంచడానికి హెయిర్ డ్రైయర్‌ను( Hair Dryer ) ఉపయోగించింది.ఈ బాలికకు చాలా కష్టం కలిగింది అయినా సరే పిల్లి ఒళ్ళు వెచ్చగా మారే వరకు ఆమె ప్రయత్నం ఆపలేదు.
ఆ బాలిక పేరు తెలియ రాలేదు కానీ తన ఇంటి ముందు చలికి దాదాపు గడ్డ కొట్టుకుపోయిన పిల్లి పిల్లను చూసి చలించి పోయింది.పిల్లి చావు అంచుల వరకు వెళ్ళింది.అప్పుడు ఆ బాలిక కుటుంబ సభ్యులను పిలిచి పిల్లిని ఇంట్లోకి తీసుకువచ్చింది.తర్వాత తన హెయిర్ డ్రైయర్ తీసుకుని పిల్లి శరీరం పైన హెయిర్ బ్లో చేయడం మనం వైరల్ వీడియోలో చూడవచ్చు.
చిన్నారి చేసిన ప్రయత్నం ఫలించింది.కాసేపటికి ఆ పిల్లి కోలుకోవడం మొదలుపెట్టింది.
దాంతో ఈ బాలిక ఎంతో సంతోషించింది.ఒక సౌకర్యవంతమైన స్వెటర్ దానికి తొడిగింది, తరువాత ఆ చిన్న పిల్లి పాలు తాగడం మొదలుపెట్టింది.
ఆ చిన్నమ్మాయి కష్టపడి ప్రయత్నించకపోతే ఆ పిల్లి బతికేది కాదు.ఆ బాలిక దీనికి పునర్జన్మ ఇచ్చిందని చెప్పవచ్చు.
ఈ సంఘటన చైనాలో జరిగింది.ఆ బాలిక తండ్రి (39 సంవత్సరాలు) ఈ వీడియోను డౌయిన్ అనే చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మొదటగా పోస్ట్ చేశారు.ఆయన ఈ వీడియోకు “రెండు గంటల కష్టపడి ప్రయత్నించిన తర్వాత, ఆ పిల్లి చివరకు బతికింది.” అని క్యాప్షన్ ఇచ్చారు.ఈ వీడియో త్వరగా వైరల్ అయింది ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా షేర్ చేయడం జరిగింది.మదర్‌షిప్ అనే అకౌంట్ ఈ వీడియోను, “నువ్వు నిజంగా ఏడవాలని అనుకోలేదు కానీ, ఈ వీడియో నిన్ను కచ్చితంగా ఏడిపిస్తుంది.” అనే క్యాప్షన్ తో పంచుకుంది.
ఆమెలోని మంచితనాన్ని చూసి నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు.
ఈ చిన్నారి భవిష్యత్తులో ఎంతో మంచి మనిషిగా తయారవుతుందని కామెంట్లు చేశారు.ఆమె మనిషి రూపంలో ఉన్న దేవత అని పొగిడారు.
కొంతమంది ఈ బాలికను ఒక ఆణిముత్యం అని ప్రశంసించారు.ఈ హార్ట్ టచింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.