వైరల్ వీడియో: గాలిపటం తో పాటు గాల్లోకి ఎగిరిన చిన్నారి...!

పతంగులంటే అందరికీ తెలిసిందే.అయితే ఇక్కడ మటుకు చాలామంది వాటిని గాలిపటాలు అని పిలుస్తూ వుంటారు.

 Kite Swings Child Into The Air At Taiwan Festival, Taiwan Kite Festival, 3 Year-TeluguStop.com

ముఖ్యంగా చిన్నపిల్లలకి పతంగులంటే చాలా ఇష్టం.మన దగ్గర సంక్రాతి సీజన్ లో అంటే జనవరి నెలలో ఈ పతంగి ఫెస్టివల్ సాధారణంగా జరుపుకుంటారు.

సంక్రాతి వారంలో ఒకరోజు దీనికి కేటాయించి చిన్నపిల్లలతో పెద్దవారు కూడా కలిసి దీన్ని ఎంజాయ్ చేస్తూ వుంటారు.అయితే ఇది ఇక్కడికే పరిమితం కాలేదు.

వివిధ రాష్ట్రాలను దాటుకొని దేశ దేశాలలో కూడా ఈ ఫెస్టివల్ చేసుకుంటూ వుంటారు.

తైవాన్ ప్రజలు కూడా ఎంతో హట్టహాసంగా ఈ పతంగుల పండగను జరుపుకుంటారు.

ఇక్కడ వివిధ రకాల ఆకృతులలో పెద్ద పెద్దగా పతంగులు తయారు చేసుకొని ఆకాశంలోకి ఎగరేస్తూ వుంటారు.ఆ పండగ రానే వచ్చింది.ప్రజలందరూ పతంగులు ఎగర వేయడంలో బిజీ అయిపోయారు.ఇంతలో ఓ అనూహ్యమైన సంఘటన జరిగింది.

ఎవరూ ఊహించని విధంగా ఓ పతంగితో పాటుగా ఓ చిన్నారి అమాంతం గాల్లోకి ఎగరడం కనిపించింది.దాంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ ఆందోళన చెందారు.

ఓ మూడేళ్ల చిన్నారి పతంగితో పాటు కొన్ని నిముషాలపాటు అలాగే గాల్లో ఎగిరింది.ఈ ఘటన ఉత్తర తైవాన్ లో చోటు చేసుకుంది.తైవాన్ రాజధానికి 80 కిలోమీటర్ల దూరంలో హింజో అనే ప్రాంతంలో నిర్వహస్తున్న పతంగి పండుగకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా సందడిగా సాగుతున్న పండగలో ఈ మూడేళ్ల చిన్నారిని గాలిపటం తనతో పాటు తీసికెళ్ళిపోవడంతో అందరూ రెప్పపాటు సమయంలో ఆశ్చర్యంతో పాటు కంగారు పడిపోయారు.

ఇంతలో కొందరు అప్రమత్తంగా వ్యవహరించి ఆ పాపను రక్షించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube