ముద్దులో తప్పేముంది అంటున్న హీరోయిన్

ఈ కాలం హీరోయిన్ల మాటలే వేరు.చెంపదెబ్బ కొట్టినట్టు, సూదితో గుచ్చినట్టు సూటిగా ఉంటాయి.

 Kissing Is Not Crime – Alia Bhatt-TeluguStop.com

ఇప్పుడున్న హీరోయిన్లందరిలో ఆలియా భట్ అదోరకం.చాలా బోల్డ్.

మీడియాకి అస్సలు లొంగదు.

ఇప్పటివరకూ అలియా నటించిన ప్రతి సినిమాల్లో దాదాపుగా అన్నీటిలో ముద్దు సన్నివెశాలు ఉన్నాయి.

ముద్దు సన్నివేశాల్లో ఏమాత్రం మొహమాటం లేకుండా నటించేస్తుంది ఈ ముద్దుగుమ్మ.అందుకే బాలివుడ్ జనాలు ” సీరియల్ కిస్సర్” “ఫీమేల్ ఇమ్రాన్ హష్మి” అనే పేర్లు పెట్టేసారు.

ఇదే విషయాన్ని ఆలియా ముందు ప్రస్తావించగా ” నాకు తెలుసు, నన్ను రకరకాల పేర్లతో పిలిస్తున్నారని.ముద్దు సన్నివేశాలు కథలో భాగం.

ఒక అబ్బాయికి ప్రేయసిగా నటిస్తున్నప్పుడు ఆ అబ్బాయి ప్రేయసిలానే ప్రవర్తించాలి.మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే తను మిమల్ని ముద్దు పెట్టుకోదా? పెళ్లాయ్యకా మీ భార్య మిమ్మల్ని ముద్దు పెట్టుకోదా? అసలు ముద్దు పెట్టుకోవడం ఏదో తప్పు అన్నట్లు రాస్తారు మీడియావారు.ముద్దు అనేది ప్రేమ వ్యక్తీకరణలో ఒక భాగం.కథలో పాత్రల మధ్య ఉన్న ప్రేమ లోతుని చెప్పటానికే ముద్దు సన్నివేశాలు పెడతారు.” అంటూ చిర్రుబుర్రులాడిపోయింది ఆలియా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube