నన్ను ముద్దు పెట్టుకున్నాడు అంటున్న బాహుబలి భామ

బిగ్ బాస్ షో ఇక్కడ అందరికి తెలుసు కదా.సల్మాన్ ఖాన్ యాంకర్ గా చేసే ఈ కార్యక్రమం ఏడాదికో సీజన్ లా వస్తుంది.

 Kiss In Friendship Between Nora Fatehi And Prince-TeluguStop.com

కొంతమంది సెలెబ్రిటిలని ఒక ఇంట్లో పడేసి, ఆడియెన్స్ ని వాళ్ళ పద్ధతిని బట్టి ఓట్లు వేయమంటారు.ఒక్కకరు ఇల్లు వదిలిపోతుంటే, చివరికి మిగిలినవారే విజేత.

వారికి లక్షల్లో బహుమతులు ఇస్తారు.ఈ షోలోకి ఈ ఏడాది వెళ్ళిన వాళ్ళలో నోరా ఫతేహి కుడా ఉంది.

నోరా ఎవరు అని కన్ఫ్యూజ్ అవకండి.బాహుబలి, టెంపర్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది.

తెలుగువాళ్ళకి తెలిసిన ముఖమే.

ప్రిన్స్ అనే మరో పోటిదారుడు నోరాతో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు.

వీరిద్దరి మధ్య ఎదో ఉందని అంతా అనుకుంటున్నారు.ఇద్దరు “ఆ” పనులు కుడా చేసేసుకున్నారు అని కుడా రూమర్స్ వస్తున్నాయి.కాని మా మధ్య అదేమీ లేదు అంటోంది నోరా.” అందరు అనుకుంటున్నట్టుగా మా మధ్య ఏమి లేదు.తనకి నేనంటే, నాకు తానంటే ఇష్టమే.కాని అది స్నేహం మాత్రమే.తను నన్ను ముద్దు పెట్టుకున్న మాట నిజమే.మీరంతా చూడకముందు కుడా నన్ను ముద్దుపెట్టుకున్నాడు.

చాలా సార్లు పెట్టుకున్నాడు.కాని అది ముద్దు మాత్రమె.

మేము హద్దులేమి దాటలేదు.అంత మాత్రానా మా మధ్య ఎదో ఉన్నట్టు కాదు ” అని తనకు మాత్రమె అర్థం అయ్యే సమాధానం ఇచ్చింది నోరా.

స్నేహం ఏమిటో, స్నేహంలో ముద్దులు పెట్టుకోవదాలు ఏమిటో, ఇద్దరికి ఇష్టం ఏమిటో, ఇవన్ని ఉండి ఏమి లేకపోవడం ఏమిటో !

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube