ప‌వ‌న్‌ను న‌మ్ముకుని నిండా మునిగిన డైరెక్ట‌ర్‌... నాలుగేళ్లు బొక్క‌..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా నిన్న అంతా ప‌వ‌న్ సినిమాల అప్‌డేట్స్‌తో సోష‌ల్ మీడియా మార్మోగిపోయింది.ప‌వ‌న్ సినిమాల‌పై వ‌రుస క్రేజీ అప్‌డేట్లు ఆయ‌న అభిమానుల‌కు మంచి కిక్ ఇచ్చాయి.

 Pawan Kalyan Time Waste Kishore Kumar Dolly,kishore Kumar,dolly,pawan Kalyan,hap-TeluguStop.com

ముందు వ‌కీల్‌సాబ్ మోష‌న్ పోస్ట‌ర్‌తో ప్రారంభ‌మైన వీరంగం సాయంత్రం వ‌ర‌కు కొన‌సాగింది.వ‌కీల్‌సాబ్ మోష‌న్ పోస్ట‌ర్ వ‌చ్చిన వెంట‌నే ప‌వ‌న్ – సురేంద‌ర్ రెడ్డి సినిమా ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది.

ఆ వెంట‌నే మ‌ధ్యాహ్నం క్రిష్ – ప‌వ‌న్ సినిమా ప్రీ లుక్ వ‌దిలారు.సాయంత్రం హ‌రీష్ శంక‌ర్ ప‌వ‌న్ – త‌న కాంబోలో వ‌చ్చే సినిమా లుక్ రివీల్ చేశారు.

శ్రీ సూర్య మూవీస్ బ్యాన‌ర్‌పై ఏ.ఎం.ర‌త్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవ‌న్నీ అంచనాల‌కు అనుగుణంగా వ‌చ్చిన‌వే అయినా చిరు – సురేంద‌ర్‌రెడ్డి ప్రాజెక్టు ఎనౌన్స్‌మెంట్ చాలా మంది ఊహించ‌లేదు.

సైరా షూటింగ్ టైంలోనే ప‌వ‌న్ డ‌బ్బింగ్‌కు వ‌చ్చిన టైంలో చిరు స‌మ‌క్షంలోనే ప‌వ‌న్ – సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌పై చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ట‌.అంత‌కు ముందే అంటే గ‌త ఎన్నిక‌ల‌కు ముందే ప‌వ‌న్ రామ్ తాళ్లూరి ద‌గ్గ‌ర అడ్వాన్స్‌లు తీసుకున్నారు.

ఇలా అనుకోకుండా ఈ కాంబినేష‌న్ సెట్ అయ్యింది.ఇదిలా ఉంటే ప‌వ‌న్ ఇప్పుడు వ‌రుస‌గా న‌లుగురు ద‌ర్శ‌కుల‌కు సినిమాలు క‌మిట్ అయిపోయాడు.

ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్‌తోనూ ఉండొచ్చు.

Telugu Dolly, Happy, Kishore Kumar, Kishorekumar, Pawan Kalyan, Time Waste, Toll

అయితే ప‌వ‌న్ కోసం నాలుగేళ్ల‌కు పైగా వెయిట్ చేస్తోన్న ఓ ద‌ర్శ‌కుడు నిండా మునిగిపోయాడు.కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాతో ఇండస్ట్రీలో వ‌చ్చిన కిషోర్ కుమార్ పార్దాసాని ( డాలీ) ఆ త‌ర్వాత త‌డాఖాతో హిట్ కొట్టాడు.ఆ వెంట‌నే ప‌వ‌న్ – వెంకీ కాంబోలో వ‌చ్చిన గోపాల గోపాల‌కు ఛాన్స్ కొట్టేశాడు.

ఆ వెంట‌నే త‌న నెక్ట్స్ సినిమాను కూడా ప‌వ‌న్‌తోనే తెర‌కెక్కించాడు.కోలీవుడ్‌లో హిట్ అయిన అజిత్ వీర‌మ్ ను కాట‌మ‌రాయుడుగా రీమేక్ చేశారు.

ఆ సినిమా అప్ప‌టికే తెలుగు ప్రేక్ష‌కులు చూసేశారు.అయినా ప‌వ‌న్ ఇష్ట‌ప‌డి మ‌రీ ఇక్క‌డ రీమేక్ చేసినా ప్లాప్ అయ్యింది.

దీంతో ప‌వ‌న్ డాలీకి మ‌రో ఛాన్స్ ఇస్తాన‌న‌డంతో అప్ప‌టి నుంచి వెయిట్ చేస్తూ వ‌చ్చాడు.ఇక ఎన్నిక‌ల టైంలో జ‌న‌సేన‌కు కొంత స‌హ‌కారం కూడా అందించాడ‌ట‌.అలా నాలుగేళ్ల పాటు ప‌వ‌న్ చుట్టూనే తిరిగాడు.వాస్త‌వంగా సూర్య మూవీస్ తీసే క్రిష్ సినిమాను డాలీయే డైరెక్ట్ చేయాలి.

చివ‌ర‌కు ఆ ప్రాజెక్టులోకి క్రిష్ వ‌చ్చాడు.ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం డాలీ క‌థ‌లు ప‌వ‌న్‌ను మెప్పించ లేక‌పోవ‌డంతోనే ప‌వ‌న్ అత‌డికి ఛాన్స్ ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది.

ఏదేమైనా ప‌వ‌న్ కోసం నాలుగేళ్ల టైం డాలీ వేస్ట్ చేసుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube