సారీ అచ్చెన్న ! ఆ అవమానం పై స్పందించిన కేంద్ర మంత్రి 

నిన్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్న నాయుడుకి అవమానం జరిగింది.కిషన్ రెడ్డి ఆహ్వానం మేరకు అచ్చెన్న నాయుడు భీమవరం సభకు హాజరయ్యారు.

 Kishan Reddy Respond On Atchennaidu Issue Details, Ap Tdp, Kinjarapu Achennaiudu-TeluguStop.com

టిడిపి తో పాటు, జనసేన పార్టీకి ఆహ్వానాలు పంపించారు.అయితే ప్రధానమంత్రి కి స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ వద్దకు వెళ్లే క్రమంలో ఆహ్వానితుల జాబితాలో అచ్చెన్న నాయుడు పేరు లేదని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఆయనను అడ్డుకోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో వెనక్కి వెళ్లిపోయారు.

తనను హెలిప్యాడ్ వద్దకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారని, ఎస్పీజీ అనుమతి కూడా ఉందని, ఆ లిస్టులో తన పేరు నమోదయిందని అచ్చెన్న నాయుడుకు కలెక్టర్ చెప్పినా, తనకు అందించిన జాబితాలో మీ పేరు లేదని, కాబట్టి వెళ్లేందుకు అనుమతించేది లేదని కలెక్టర్ ప్రశాంతి తెలపడంతో తీవ్ర అవమానమారంతో అచ్చెన్న వెనుదిరిగారు.ఆ తరువాత తనకు జరిగిన అవమానంపై అచ్చెన్న అనేక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ప్రభుత్వమే కావాలని తన పేరు లిస్టులో లేకుండా చేసిందని, రమ్మని ఆహ్వానించి, ఇలా లిస్ట్ లో పేరు లేకుండా చేయడం ఏంటి అని అచ్చెన్న వ్యాఖ్యానించడంతో ఈ సంఘటనపై కేంద్ర పర్యటన శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

Telugu Ap Cm Jagan, Ap Tdp, Central, Chandrababu, Jagan, Janasena-Political

సాంకేతిక కారణాలతోనే ఈ విధంగా జరిగిందని, ఈ విషయంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడుకి జరిగిన అవమానానికి క్షమాపణలు చెబుతున్నామంటూ కిషన్ రెడ్డి తెలిపారు.సాంకేతిక కారణాలతో, ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన జాబితాలో పేరు లేకపోవడం వల్లే ఈ విధంగా జరిగిందని, దీనికి బాధ్యత వహిస్తూ అచ్చెన్నాయుడి కి క్షమాపణలు చెబుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఎస్ పి జి కి ఇచ్చిన జాబితాలో అచ్చెన్న పేరు ఉన్నా, కేంద్ర మంత్రి చెప్పినా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంపై కేంద్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube