టిఆర్ఎస్ ఎంపీలపై కిషన్ రెడ్డి సెటైర్లు..!!

Kishan Reddy Satires On Trs Mps

ప్రస్తుతం శీతాకాల పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ… పార్లమెంటు సమావేశాలను బహిష్కరించడం జరిగింది.

 Kishan Reddy Satires On Trs Mps-TeluguStop.com

వారం రోజుల నుండి పార్లమెంటు వేదికగా టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు ఆందోళన చేస్తున్నా గాని కేంద్రం నుండి స్పష్టత రాకపోవడంతో… పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు… టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు.

ఈ క్రమంలో “కిసాన్ బచావో“.“కిసాన్ బచావో”.అంటూ పార్లమెంటు సాక్షిగా నినాదాలు చేస్తూ బహిష్కరించడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీల పై సెటైర్లు వేశారు.

 Kishan Reddy Satires On Trs Mps-టీఆర్ఎస్ ఎంపీలపై కిషన్ రెడ్డి సెటైర్లు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు “కిసాన్ బచావో”.అని నినాదాలు చేస్తుంటే.మిగతా వాళ్ళకి “కేసీఆర్ బచావో“.అనే నినాదం చేసినట్లు ఉందని… “కిసాన్ బచావో” అన్న రీతిలో ఆ నినాదం లేదని.“కేసీఆర్ బచావో” అన్న నినాదంగా పార్లమెంట్ లో వినిపించిందని.కిషన్ రెడ్డి సెటైర్లు వేయడం జరిగింది.

ఇదిలా ఉంటే.పార్లమెంటు సమావేశాలు బాయ్ కాట్ చేసిన అనంతరం టీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కేశవరావు మాట్లాడుతూ.

కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.అంత మాత్రమే కాక త్వరలోనే తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

#Kishan #KishanTrs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube