ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సంచలన వాఖ్యలు చేసిన కీర్తి సనన్!  

సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి తనుశ్రీ దత్తా ఇండియాలో మొదలు పెట్టిన మీటూ మీటూ కాంపైన్ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని చిత్ర పరిశ్రమలలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న హీరోయిన్స్, నటీమణులు మీడియా ముందుకొచ్చి గతంలో వారికి ఎదురైనా వేధింపులని చెప్పడంతో పాటు, తమని వేధించిన వారి గురించి కూడా బయటపెట్టారు. లైంగిక వేధింపులపై జరిగిన మీటూ ఉద్యమానికి కొంత మంది మద్దతుగా నిలబడితే కొంత మంది మాత్రం అదో పెద్ద నాన్సెన్స్ అంటూ కొట్టిపారేశారు.

Kirthi Sanon Says Meetoo Movement Good For Film Industry-Meetoo

Kirthi Sanon Says Meetoo Movement Good For Film Industry

ఇదిలా వుంటే తెలుగులో మహేశ్ కి జోడీగా వన్ సినిమాలో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ మీటూ ఉద్యమం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వాఖ్యలు చేసారు. సినిమా ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పిన కీర్తి, మీటూ ఉద్యమం కారణంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో వేధింపులు చాలా వరకు తగ్గాయని వాఖ్యానించింది. ఇప్పుడు తమలాంటి నటీమణులతో అందరూ ఆచితూచి మాట్లాడుతున్నారని, తప్పుడు మాటలు మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారని కీర్తి సనన్ చెప్పుకొచ్చింది. నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఇది మంచి పరిణామం అని ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేసింది.