ఆసక్తిని రేకెత్తిస్తున్న కిరణ్ రాజ్ విక్రమ్ గౌడ్ టీజర్..!

Kiran Raj Vikram Goud Teaser Viraling On Social Media

నరసింహ రావు దర్శకత్వంలో కిరణ్ రాజ్, దీపిక సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీమతి కణిదరపు వెంకాయమ్మ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై సుహాసిని నిర్మిస్తున్నారు.తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతోన్న బైలింగ్వెల్ ఫిల్మ్ ‘విక్రమ్ గౌడ్’.

 Kiran Raj Vikram Goud Teaser Viraling On Social Media-TeluguStop.com

పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను హైదరాబాద్ లోని డిఎస్కే స్క్రీన్ స్టూడియోస్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, చిత్ర నిర్మాతలు ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు.

టీజర్ విడుదల అనంతరం ఈ సినిమా ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయని వచ్చే ఏడాది మంచి విజయాన్ని అందుకోబోయే సినిమాగా నిలుస్తుందని ప్రతాని డి.ఎస్.రావు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

 Kiran Raj Vikram Goud Teaser Viraling On Social Media-ఆసక్తిని రేకెత్తిస్తున్న కిరణ్ రాజ్ విక్రమ్ గౌడ్ టీజర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా విషయానికి వస్తే రెండు రాష్ట్రాలలో కలిపి30 ఎం పి సీట్లు వచ్చినా కేంద్రంలో చక్రం తిప్పేలేని పరిస్థితులు ఏర్పడ్డాయని అని చెప్పే డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి.

ఐ సినిమా నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది.అలాగే హీరో మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఉన్న అమ్మాయిల మైండ్ సెట్ ఏ విధంగా ఉందో చెప్పే డైలాగులు అద్భుతంగా నిలిచాయి.

ముఖ్యంగా వజ్రపు బియ్యంతో ముఖేష్ అంబానీ తిన్నా, బంగారు బియ్యంతో రామోజీరావు తిన్నా తినేది గుప్పెడు బియ్యమే కదా అని చెప్పే డైలాగ్ టీజర్ కు ఎంతో హైలెట్ గా నిలిచాయి.

టీజర్ విడుదల అనంతరం పలువురు మాట్లాడుతూ ఈ సినిమా కొత్త వాళ్ళు తెరకెక్కించిన విధంగా ఏమాత్రం లేదని ఎంతో అనుభవం ఉన్న వారు చేసిన విధంగా సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని తెలిపారు.

ఇలాంటి వారికి ప్రోత్సాహం దొరికితే మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని తెలిపారు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు.

ఇందులో పోసాని, మురళీకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు.మంత్ర ఆనంద్ సంగీతం జానకిరామ్ ఎడిటింగ్, బి రాఘవేంద్ర సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరింత హైలైట్ గా నిలిచాయి.

ఎన్నో పొలిటికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ టీజర్ ప్రస్తుతం సినిమాపై ఎన్నో అంచనాలను పెంచుతుంది.

#Teaser #KiranRaj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube