రోడ్డు ప్రమాదంలో మరణించినా ఆరుగురిలో మాత్రం జీవించే ఉన్నాడు!

అవయవదానం ఎంత గొప్పదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.ఈ అవయవదానం వల్ల బౌతికంగా వ్యక్తి మనదగ్గర లేకపోయినా ఆ వ్యక్తి అవయవాలు దానం చేయడం ద్వారా ఆ వ్యక్తి మరో కొంతమంది లో బతికే ఉంటారు.

 Kiran Kumar Donatedsixorgans To Sixmembers 1tstop-TeluguStop.com

ఇలాంటి గొప్ప అవయవదానం గురించి తెలుసుకున్న ఒక చిన్న కుటుంబం ఆ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అవ్వడం తో అతడి అవయవాలు దానం చేసి అతడిని సజీవంగా నిలిపారు.అమీర్‌పేట ప్రగతినగర్‌కు చెందిన జానంపేట్ కిరణ్ కుమార్(35) రోజు వారి వేతనాలకు పనిచేస్తూ భార్య రేణుక, కుమారుడు రాణేశ్‌రాజ్‌ను పోషించుకుంటున్నాడు.

ఈ నెల 27న ప్యారడైజ్ సర్కిల్ వద్ద ప్యాట్నీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం తో తలకు తీవ్ర గాయం కాగా, కుటుంబసభ్యులు సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి కి తరలించారు.అయితే ఐసీయూ లో చికిత్స పొందుతున్న కిరణ్ బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు.

కుటుంబ సభ్యులను కలిసి జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవదానం విశిష్టతను వారికి వివరించగా, అందుకు అంగీకరించారు.

కిరణ్‌కుమార్ శరీరం నుంచి గుండె, కాలేయం, రెండు మూత్రపిండాలు, కండ్లను సేకరించి అవయవదానం ద్వారా మరో ఆరుగురికి కొత్త జీవితాన్ని అందించినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube