సూర్యుడు నుంచి ఓంకార నాదం... నాసా వీడియో అంటున్న కిరణ్ బేడీ

ఈ ప్రకృతి నుంచి వినిపించే ప్రణవనాదం ఓంకార శబ్దం అని సనాతన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరు విశ్వసిస్తూ ఉంటారు.ప్రణవం నాద సబ్ధమైన ఓంకార నాదాన్ని ప్రకృతిలో పంచ భూతాల నుంచి వినిపిస్తుంది అని చాలా మంది నమ్ముతారు.

 Kiran Bedi Shares Fake Nasa Video Of Sun Chanting Om-TeluguStop.com

ఇక ఈ ప్రణవనాద శక్తి అయిన పరమాత్మ తత్త్వంగా భావించే శివుడుని ఆరాధ్యుడుగా అందరూ ఆరాధిస్తూ ఉంటారు.అయితే ఇతర మతాల వారు దీనిని అంతగా విశ్వసించకపోయిన, సనాతన ధర్మంలో చెప్పే కొన్ని విషయాల మీద నాసా పరిశోధనలు కూడా చేస్తుంది.

ఇక ఈ పరిశోధనలలో మన సనాతన ధర్మం చెప్పే చాలా విషయాలు వాస్తవం అని తెలిసింది.తాజాగా పాండిచ్చేరి గవర్నర్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ ఓ ఆసక్తికరమైన వీడియో పోస్ట్ చేసింది.

ట్విట్టర్‌లో ఓ నకిలీ వీడియోను ఆమె పోస్ట్ చేశారు.సూర్యుడి నుంచీ ఓం అనే శబ్దం వస్తుండటాన్ని నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ) రికార్డ్ చేసిన వీడియో అని దానికి కాప్షన్ పెట్టారు.

అయితే ఈ వీడియో వాస్తవం కాదని నకిలీది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.అది పక్కా రికార్డ్ చేసిన వీడియో అని దానిని వింటే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుందని చెబుతున్నారు.

ఇలాంటి ఫేక్ వీడియోలో కిరణ్ బేడీ లాంటి ఉన్నత వ్యక్తి పోస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే సూర్యుడి నుంచి ఓంకార నాదం వినిపిస్తుంది అని నాసా ద్రువీకరించింది అంటూ గతంలో చాలా వార్తలు వినిపించాయి.

మరి ఈ వీడియోలో వాస్తవం ఎంత అనేది నాసా అధికారికంగా ద్రువీకరించే వరకు స్పష్టం కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube