ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరం.. ఆ క్వాలిటీ ఇష్టమంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ ఉన్న హీరోలలో ఒకరు కాగా యంగ్ జనరేషన్ హీరోలు సైతం ఆయన యాక్టింగ్ స్కిల్స్ కు ఫిదా అవుతున్నారు.వరుసగా ఆరు విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన తారక్ హీరోగా అంతకంతకూ ఎదుగుతుండగా వినరో భాగ్యము విష్ణుకథ ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించడం గమనార్హం.

 Kiran Abbavaram Shocking Comments About Young Tiger Ntr Details Here Goes Viral-TeluguStop.com

కిరణ్ అబ్బవరం నెటిజన్లతో ముచ్చటిస్తూ తారక్ మాడ్యులేషన్ అంటే తనకు ఎంతో ఇష్టమని కామెంట్ చేశారు.జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలని ఒక నెటిజన్ కోరగా తారక్ మాడ్యులేషన్ గురించి కిరణ్ అబ్బవరం ఈ విధంగా కామెంట్ చేశారు.

రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమాలలో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, విక్రమార్కుడు సినిమాలు అంటే ఇష్టమని కిరణ్ అబ్బవరం కామెంట్లు చేశారు.

Telugu Kiran Abbavaram, Sammathame, Tollywood, Vinarobhagyamu-Movie

రాజావారు రాణివారు సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన కిరణ్ అబ్బవరం ఎస్సార్ కళ్యాణమండపం సక్సెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.సమ్మతమే సినిమాతో మరో సక్సెస్ ను ఈ హీరో ఖాతాలో వేసుకున్నారు.పక్కింటి అబ్బాయిలా కనిపించే కిరణ్ అబ్బవరం వరుసగా ప్రముఖ బ్యానర్లలో నటిస్తూ పాపులారిటీని పెంచుకుంటున్నారు.

కిరణ్ అబ్బవరంకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.

Telugu Kiran Abbavaram, Sammathame, Tollywood, Vinarobhagyamu-Movie

వినరో భాగ్యము విష్ణు కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో తెరకెక్కిందని తెలుస్తోంది.గత సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో కిరణ్ అబ్బవరం కథల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.ఈరోజు వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్ రిలీజ్ కానుంది.

టాలీవుడ్ హీరోలలో ఒకరైన సాయితేజ్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ఈ నెల 17వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube