కిరణ్ అబ్బవరం సమ్మతమే ఓటిటి రిలీజ్ డేట్ లాక్..!

యువ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి కలిసి నటించిన సినిమా సమ్మతమే.గోపీనాథ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 24న రిలీజ్ చేశారు.

 Kiran Abbavaram Sammatame Ott Release Date Lock Kiran Abbavaram ,sammatame , Ott Release-TeluguStop.com

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా యూత్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది.కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా సమ్మతమేతో కిరణ్ అబ్బవరం మరోసారి ప్రేక్షకులను అలరించారని చెప్పొచ్చు.

అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మేకర్స్ వెంటనే సినిమాని డిజిటల్ రిలీజ్ కు రంగం సిద్ధం చేశారు.

 Kiran Abbavaram Sammatame OTT Release Date Lock Kiran Abbavaram ,Sammatame , OTT Release -కిరణ్ అబ్బవరం సమ్మతమే ఓటిటి రిలీజ్ డేట్ లాక్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సమ్మతమే సినిమా డిజిటల్ రైట్స్ ఆహా సొంతం చేసుకుంది.

సినిమాకు థియేటర్ లో ఎలాగు పూర్ రెస్పాన్స్ ఉందని త్వరలో డిజిటల్ రిలీజ్ ని ఫిక్స్ చేశారు.జూలై 15న కిరణ్ అబ్బవరం సమ్మతమే ఓటీటీ రిలీజ్ అవుతుంది.

థియేటర్ లో చూడలేని ప్రేక్షకులు ఈ సినిమాని ఓటీటీలో చూసేయొచ్చు.ఈమధ్య చిన్న సినిమాలన్నిటికి ఆహా మంచి అవకాశం ఇస్తుంది ఆహా లో డిజిటల్ రిలీజ్ అయితే థియేట్రికల్ రిలీజ్ లానే ఓ చిన్న ఈవెంట్ కూడా ప్లాన్ చేసి మరి ప్రమోట్ చేస్తున్నారు.

అది ఆహాకి మంచి జరిగినా తమ సినిమా మరింత మంది ప్రేక్షకులకు దగ్గరవుతుందని చిత్రయూనిట్ కూడా భావిస్తున్నారు.అందుకే ఆహా డిజిటల్ రిలీజ్ అంటే సినిమా రీ రిలీజ్ అన్నట్టే లెక్క.

ప్రమోషన్స్ కూడా అదే విధంగా ఉంటాయి.మరి థియేటర్ లో అలరించలేని సమ్మతమే ఓటీటీ ఆడియెన్స్ నైనా సరే ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

తన మార్క్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న కిరణ్ అబ్బవరం సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా తన ప్రయత్నాలు మాత్రం చేస్తూ వెళ్తున్నాడు.తప్పకుండా అతనికి ఏదో ఒకరోజు మంచి సక్సెస్ వచ్చి తీరుతుందని చెప్పొచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube