మొగులయ్య భార్య తిండి లేక చనిపోయారట.. ఆయన కన్నీటి కష్టాలివే?

కళను నమ్ముకుని జీవనం సాగిస్తున్న జానపద కళాకారులలో కిన్నెర మొగులయ్య ఒకరనే సంగతి తెలిసిందే.భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడటం వల్ల కిన్నెర మొగులయ్య ప్రజల దృష్టిలో పడ్డారు.

 Kinnera Mogulaiah Struggling With Financial Troubles Details, Financial Troubles-TeluguStop.com

తెలంగాణ జానపద కళాకారుడు అయిన మొగులయ్యకు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ద్వారానే భారీస్థాయిలో పాపులారిటీ, గుర్తింపు వచ్చింది.తాజాగా పవన్ మొగులయ్యను వ్యక్తిగతంగా కలిసి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

మొగులయ్య తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాకు చెందినవారు.భీమ్లా నాయక్ పాట రిలీజయ్యాక తనకు వరుసగా కాల్స్ వస్తున్నాయని మొగులయ్య చెప్పుకొచ్చారు.తాను బీద పరిస్థితిలో ఉన్నానని 1000 రూపాయలు లేక భార్య చనిపోయిందని మొగులయ్య అన్నారు.భార్య చనిపోయిన తర్వాత ఖర్చులకు కె.వి రమణాచారి సహాయం చేశారని తిండి లేక భార్యకు అనారోగ్య సమస్యలు వచ్చాయని మొగులయ్య చెప్పారు.

తనకు చెడు వ్యసనాలు లేవని తాగుడు అలవాటు ఉన్నవారు తనకు నచ్చరని మొగులయ్య చెప్పుకొచ్చారు.

తన కొడుకులు సైతం అనారోగ్య సమస్యలతో బాధ పడ్డారని మొగులయ్య తెలిపారు.రేషన్ బియ్యం వస్తున్నాయని ఆ బియ్యం తింటూ జీవనం సాగిస్తున్నామని మొగులయ్య చెప్పుకొచ్చారు.దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తున్నాడని శ్రీనివాస గౌడ్ సార్ ఇళ్లు విషయంలో సహాయం చేస్తానని చెప్పారని మొగులయ్య పేర్కొన్నారు.

తన వయస్సు ప్రస్తుతం 68 సంవత్సరాలు అని పని చేయడం తన వల్ల కావడం లేదని మొగులయ్య తెలిపారు.నేను సొంతంగా కిన్నెరను తయారు చేస్తానని పది మందికి కిన్నెర కళ నేర్పాలని తాను భావిస్తున్నానని మొగులయ్య పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ ఇప్పటికే మొగులయ్యకు సహాయం చేయగా తెలంగాణ ప్రభుత్వం మొగులయ్యను ప్రోత్సహించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

తెలంగాణ సర్కార్ గతంలో కిన్నెర మొగులయ్యకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరేలా సహాయాలు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube