‘పంజా’బ్ దెబ్బకు బెంగళూరు ఛాలంజెర్స్ విలవిల…!  

rcb, kxip, ipl, ipl 2020, virat kohil, kl rahul, victory - Telugu Ipl, Ipl 2020, Kl Rahul, Kxip, Rcb, Victory, Virat Kohil

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దెబ్బకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలవంచక తప్పలేదు.ఐపీఎల్ 11 సీజన్ లో భాగంగా జరిగిన ఆరో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు తలపడ్డాయి.

TeluguStop.com - Kingsxi Vs Rcb Ipl2020 Highlights Ipl2020

ఈ మ్యాచ్లో కోహ్లీసేన పేలవ ప్రదర్శనతో ఏకంగా 97 పరుగులతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు గెలిచింది.ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేయగలిగింది.

ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కె.ఎల్.రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు.మొదటి మ్యాచ్లో రాహుల్ నిరుత్సాహపరిచిన, తాజా మ్యాచ్లో మాత్రం రెచ్చిపోయాడు.

TeluguStop.com - పంజా’బ్ దెబ్బకు బెంగళూరు ఛాలంజెర్స్ విలవిల…-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించాడు.ఇదే క్రమంలో ఐపీఎల్ 13 సీజన్ లో తొలిసారి రాహుల్ మొదటి సెంచరీను నమోదు చేశాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓడిపోవడానికి గల కారణం రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్ లను కింగ్ కోహ్లీ వదిలేయడంతో రాహుల్ వచ్చిన అవకాశాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నాడు.ఏకంగా 69 బంతుల్లో 7 సిక్సర్లు, 14 ఫోర్ల సహాయంతో 132 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

మొదటిలో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల విషయానికి వస్తే శివం దూబేకి రెండు వికెట్లు, చాహల్ కు ఒక వికెట్ దక్కాయి.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆదిలోనే కేవలం నాలుగు పరుగులకు మూడు ప్రధాన వికెట్లను కోల్పోయింది.దీంతో ఆర్సిబి ఓటమి దాదాపు ఖాయమైనట్లే కనిపించింది.

చివరికి ఆట ముగిసే సమయానికి ఏ దశలోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోలుకోలేక పోగా కేవలం 17 ఓవర్లలోనే 109 పరుగులకు చాప చుట్టేసింది.దీంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆర్ సిబి జట్టుపై 97 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి వస్తే రవి బిష్నోయ్, మురుగన్ అశ్విన్ లకు చెరో మూడు వికెట్లు సాధించగా, షెల్డాన్‌ కాట్రెల్ రెండు వికెట్లను, అలాగే మొహమ్మద్ షమీ, మాక్స్ వెల్ చెరో వికెట్ తీశారు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్స్ లో వాషింగ్టన్ సుందర్ 30 పరుగులు, ఎబి డివిలియర్స్ 28 పరుగులు, ఫించ్‌ 20 పరుగులు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.

#Virat Kohil #KXiP #Victory #KL Rahul #Ipl 2020

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kingsxi Vs Rcb Ipl2020 Highlights Ipl2020 Related Telugu News,Photos/Pics,Images..