ఈ రోజు ఐపీఎల్ లో పంజాబ్ తో సన్ రైజర్స్ మ్యాచ్.. ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూడండి..

ఐపీఎల్ లీగ్ దశ ముగిసే సమయం దాదాపు వచ్చేసినట్లే.ప్రస్తుతం బెంగళూర్ జట్టు ఢిల్లీ జట్టు పైన ఓటమి పొంది ప్లే ఆఫ్స్ బరిలో నుండి నిష్క్రమించింది.ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తో పాటు ఢిల్లీ జట్టు కూడా ప్లే ఆఫ్స్ కి అధికారంగా చేరుకున్నాయి.3 , 4 స్థానాల కోసం ప్రస్తుతం మిగితా జట్ల మధ్య పోటీ నెలకొంది.కింగ్స్ ఎలెవన్ పంజాబ్ , సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చెరో 5 మ్యాచ్ లు గెలిచి ఉన్నాయి.ప్రస్తుతం ఇరు జట్ల ప్లే ఆఫ్స్ అసలు ఈ రోజు జరగబోయే మ్యాచ్ పైనే ఆధారపడి ఉన్నాయి.

 Kings Xi Punjab Vs Sunrisers Hyderabad Match Who Will Win-TeluguStop.com

ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన 13 మ్యాచ్ లలో సన్ రైజర్స్ జట్టు 9 మ్యాచ్ లలో విజయం సాధించగా , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 4 మ్యాచ్ లలో విజయం సాధించింది.

పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం లో జరగనుంది.

ఇక్కడి పిచ్ బౌలర్ల కు అనుకూలించనుంది.టాస్ గెలిచి జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎలా ఉండబోతుంది

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆడిన 11 మ్యాచ్ లలో 5 మ్యాచ్ లలో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్తు కోసం పోరాడుతుంది.ఈ సీజన్ లో పంజాబ్ జట్టు చాలా మ్యాచ్ లలో చివర వరకు పోరాడి ఓటమి పాలయింది.

ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని ఆ జట్టు భావిస్తుంది.ఆ కట్టు విజయం సాధించాలంటే రాహుల్ లేదా గేల్ లలో ఎవరో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిందే.

ఇకపోతే మిడిల్ ఆర్డర్ లో మిల్లర్ , మాయాంక్ అగర్వాల్ , పూరన్ లతో బలంగా కనిపిస్తుంది.బౌలింగ్ లో కూడా షమీ , కుర్రాన్ , అశ్విన్ లతో పటిష్టంగా ఉంది.

కీలకమైన మ్యాచ్ లో పంజాబ్ ఎలా ఆడుతుందో వేచి చూడాల్సిందే.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు PROBABLE XI – క్రిస్ గేల్ , రాహుల్ , మాయాంక్ అగర్వాల్ , మిల్లర్ , పూరన్ ,మణిదీప్ సింగ్ , రవించంద్రన్ అశ్విన్ , హ్రడోస్ విలజోఎన్ , మహమ్మద్ షమీ ,శ్యాం కుర్రాన్ , మురుగన్ అశ్విన్

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా ఉండబోతుంది

వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమి పొంది ప్లే ఆఫ్స్ ఆశలను కఠినంగా చేసుకున్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో ఓటమి చెందితే ప్లే ఆఫ్స్ రేస్ నుండి తప్పుకున్నట్లే.

సీజన్ ఆరంభం లో డేవిడ్ వార్నర్ , బైర్ స్టో లు కీలక ఇన్నింగ్స్ లు ఆడడం వల్ల మ్యాచ్ లు వరుసగా గెలిచింది.ప్రస్తుతం జానీ బైర్ స్టో స్వదేశానికి తిరిగి వెళ్లడం , సన్ రైజర్స్ కెప్టెన్ కెన్ విల్లియమ్సన్ ఈ సీజన్ లో ఆడిన మ్యాచ్ లలో ప్రభావం చూపకపోవడం జట్టు కు ఇబ్బందికరమే.

ఇకపోతే కీలక మ్యాచ్ లలో ఫామ్ లోకి వచ్చిన మనీష్ పాండే వరుసగా రెండు మ్యాచ్ లలో అర్ధ శతాకలు సాధించాడు.బౌలింగ్ లో సన్ రైజర్స్ జట్టు ఈ మధ్య అసలు ప్రభావం చూపించడం లేదు అందువల్ల హైదరాబాద్ జట్టు ఉంచే లక్ష్యాలని ఇతర జట్లు తేలికగా చేదిస్తున్నారు.

ఈ మ్యాచ్ లో పెద్దగా మార్పులేమి లేకుండా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్ PROBABLE XI – డేవిడ్ వార్నర్ , శ్రీవాట్స గోస్వామి , మనీష్ పాండే , విజయ్ శంకర్ , కేన్ విల్లియమ్సన్ , షాకిబ్ అల్ హసన్ , మహమ్మద్ నబీ , రషీద్ ఖాన్ , భువనేశ్వర్ కుమార్ , ఖలీల్ , సందీప్ శర్మ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube