ఈ రోజు ఐపీఎల్ లో పంజాబ్ తో బెంగళూర్ మ్యాచ్... ఏ జట్టుకి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయో చూడండి..

బెంగళూర్ జట్టు గత రెండు మ్యాచ్ లలో గెలిచి మంచి జోరు మీద ఉంది మిగిలిన మ్యాచ్ లన్నింటిలో గెలిచి ఏదైనా అద్భుతం జరిగితే బెంగళూర్ జట్టుకి కూడా ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.ఇకపోతే పంజాబ్ జట్టు ఆడిన 10 మ్యాచ్ లలో 5 మ్యాచ్ ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది.

 Kings Xi Punjab Vs Royal Challengers Bangalore Match Prediction-TeluguStop.com

ఆ జట్టు ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిపోతే ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి వేరే జట్టు విజయాల పైన ఆధారపడాల్సి వస్తుంది.గేల్ , రాహుల్ లలో ఎవరో ఒకరు చివరి వరకు క్రీజులో ఉంటే పంజాబ్ కి గెలిచే అవకాశం ఉంది.బెంగళూర్ జట్టు ఆడిన గత మ్యాచ్ లో చెన్నై పైన చివరి బంతి వరకు పోరాడి గెలిచింది.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు బెంగళూర్ , పంజాబ్ జట్లు 23 సార్లు తలపడగా బెంగళూర్ 11 మ్యాచ్ లలో గెలిస్తే పంజాబ్ 12 మ్యాచ్ లలో గెలిచింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియం లో ఆడనుంది.ఇక్కడి పిచ్ ఎప్పటిలాగే బ్యాటింగ్ కి అనుకూలించనుంది.టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

3)కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎలా ఉండబోతుంది

ఈ సీజన్ లో పంజాబ్ బెంగళూర్ తో ఆడిన మునుపటి మ్యాచ్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవలన్నా లక్ష్యం తో బరిలోకి దిగనుంది.ఆ జట్టు ప్లే ఆఫ్స్ అసలు ఈ మ్యాచ్ పైనే ఆధారపడి ఉన్నాయి.ఒకవేళ బెంగళూర్ తో మ్యాచ్ లో ఓడిపోతే ఇతర జట్ల ఫలితాల పైన ఆధారపడాల్సి వస్తుంది.

పంజాబ్ బ్యాటింగ్ బలంగానే కనిపిస్తున్న కలిసికట్టుగా రాణించకపోవడం వల్ల ఆ జట్టు భారీ స్కోర్ లను చేయలేకపోతుంది.ఇకపోతే బౌలింగ్ లో అశ్విన్ , షమీ , కుర్రాన్ లతో బలంగా ఉంది.

బెంగళూర్ జట్టు బ్యాటింగ్ ని కట్టడి చేస్తే విజయావకాశాలు పంజాబ్ కే ఎక్కువ ఉంటాయి.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ( PROBABLE XI ) – క్రిస్ గేల్ , రాహుల్ , సర్ఫరాజ్ , మయాంక్ అగర్వాల్ , డేవిడ్ మిల్లర్ ,నికోలస్ పూరన్ , శ్యామ్ కుర్రాన్ , అశ్విన్ , మురుగన్ అశ్విన్ , షమీ ,అంకిత్ రాజపుత్

4)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఎలా ఉండబోతుంది

బెంగళూర్ జట్టు ఈ సీజన్ లో చాలా మ్యాచ్ లలో బ్యాటింగ్ బాగానే చేసిన వారి పేలవమైన బౌలింగ్ తో ఓటమి పాలయ్యారు.బ్యాటింగ్ లో సీజన్ ఆరంభం నుండి పార్థివ్ పటేల్ చక్కగా రాణిస్తున్నారు.చెన్నై తో మ్యాచ్ లో అతని బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తో పాటు వికెట్ కీపింగ్ తో బెంగళూర్ జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇకపోతే బెంగళూర్ జట్టు బ్యాటింగ్ కోహ్లీ , డివిలియర్స్ , మెయిన్ అలీ , స్టయినిస్ లతో పటిష్టంగా ఉంది.బౌలింగ్ లో స్టెయిన్ రాకతో కాస్త గాడిన పడ్డప్పటికి సిరాజ్ , ఉమేష్ లు డెత్ ఓవర్ లలో భారీగా పరుగులు సమర్పిస్తున్నారు.

ఈ మ్యాచ్ లో బెంగళూర్ జట్టు గెలవాలంటే బౌలింగ్ కట్టుదిట్టంగా వేసి పంజాబ్ బ్యాటింగ్ ని కట్టడి చేయాలి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ( PROBABLE XI ) – పార్థివ్ పటేల్ , కోహ్లీ , డివిలియర్స్ , మెయిన్ అలీ ,మార్కస్ స్టయినిస్ , అక్షదీప్ నాథ్ , పవన్ నెగి , చాహల్ , నవదీప్ సైని,ఉమేష్ యాదవ్ , డేల్ స్టెయిన్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube