ఈ రోజు ఐపీఎల్ లో పంజాబ్ తో కోల్ కత్తా మ్యాచ్.. ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూడండి

కోల్ కత్తా , పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్ బరి లో ఉండాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిందే.విజయం సాధించే జట్టు కి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.

 Kings Eleven Punjab Vs Kolkata Knight Riders Match Prediction-TeluguStop.com

ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఇరు జట్లకి కీలకంగా మారనుంది.కోల్ కత్తా తమ గత మ్యాచ్ లో ముంబై పైన గెలివగా , పంజాబ్ జట్టు సన్ రైజర్స్ పైన ఓటమి పాలైంది .ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు భారీ విజయం సాధిస్తే వారికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వారి నెట్ రన్ రేట్ మిగితా జట్లతో పోలిస్తే తక్కువ ఉంది.ఒకవేళ గేల్ , మిల్లర్ , రాహుల్ లు చెలరేగితే వారికి భారీ విజయం అంత కష్టమేమీ కాదు.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు కోల్ కత్తా కి పంజాబ్ కి మధ్య 24 మ్యాచ్ లు జరగగా 8 మ్యాచ్ లలో పంజాబ్ గెలవగా , 16 మ్యాచ్ లలో కోల్ కత్తా జట్టు విజయం సాధించింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ మొహాలీ లో జరగనుంది.ఇక్కడి పిచ్ బ్యాట్స్ మెన్ కి అనుకూలించనుంది.టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది.

3)కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎలా ఉండబోతుంది

పంజాబ్ జట్టు ప్రతి మ్యాచ్ లో మార్పులు చేసుకుంటూ వస్తుంది , ఆ జట్టు కెప్టెన్ అశ్విన్ కూడా సీజన్ ఆరంభం నుండి ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు.ఫామ్ లో లేక ఈ సీజన్ లో తమ స్థాయి ఇన్నింగ్స్ ఆడలేని మిల్లర్ ఈ మ్యాచ్ లో ఆడతాడో లేదో వేచి చూడాలి.

గత మ్యాచ్ లో నెమ్మదిగా ఆడిన రాహుల్ ఆట ఇతర బ్యాట్స్ మెన్ ల పైన ఒత్తిడి పెరిగి వికెట్ లు కోల్పోయేలా చేసింది.ఈ మ్యాచ్ లో రాహుల్ , గేల్ లు మొదటి 10 ఓవర్ల వరకు ఆడగలిగితే పంజాబ్ భారీ స్కోర్ చేయడం ఖాయం.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ( PROBABLE XI ) – క్రిస్ గేల్ , రాహుల్ , మాయాంక్ అగర్వాల్ , మిల్లర్ , పూరన్ , శ్యాం కుర్రాన్ / మన్ దీప్ సింగ్ , రవి అశ్విన్ , మురుగన్ అశ్విన్ , మహమ్మద్ షమీ , ముజీబ్ , ఆర్షదీప్ సింగ్

4)కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ఎలా ఉండబోతుంది

కోల్ కత్తా జట్టు ప్లే ఇఫ్స్ లో బరిలో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే.గత మ్యాచ్ లో ముంబై పైన చెలరేగి ఆడిన నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ ఏకంగా 230 కి పైగా పరుగులు చేశారు.

బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయడం ఆ జట్టు కి కలిసి వచ్చింది.ఈ మ్యాచ్ లో కోల్ కత్తా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఎలా చేస్తుందో అనే దానిపైనే వారి విజయావకాశాలు ఉన్నాయి.

ఇక బౌలింగ్ లో పీయూష్ చావ్లా , నరైన్ , హరీ గెర్నీ లతో పటిష్టంగా కనిపిస్తుంది.

కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ( PROBABLE XI ) – క్రిస్ లిన్ , సునీల్ నరైన్ , రాబిన్ ఉతప్ప , శుభమన్ గిల్ , నితీష్ రానా , దినేష్ కార్తిక్ , ఆండ్రి రస్సెల్ , రింకు సింగ్ , పీయూష్ చావ్లా , హరి గెర్నీ ,సందీప్ వారియర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube