పేరు మార్చుకోబోతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్..!

ఐపీఎల్ 2021 సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ సర్వం సిద్ధం చేస్తోంది.చెన్నై వేదికగా ఫిబ్రవరి 18వ తేదీన వేలంపాట నిర్వహించనుంది.

 Kings Eleven Punjab Ipl Team To Change Its Name, Kings Xi Punjab , Renamed, Ipl-TeluguStop.com

మరోవైపు ఇప్పటికే తమకు అవసరం లేని ఆటగాళ్లను ఎనిమిది ఫ్రాంచైజీలు వదులుకున్నాయి.వారందరినీ ఈసారి ఎవరు దర్శించుకుంటారనే ఆసక్తి నెలకొన్నది.

అయితే కొన్ని ఫ్రాంచైజీలు గత కొద్ది సీజన్ లుగా సరిగా పర్ఫామెన్స్ చేయలేకపోతున్నాయి.

ముఖ్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కనీసం క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ మ్యాచ్ లలో ఆడే అర్హత కూడా దక్కించుకోలేకపోయింది.

ఆటగాళ్లతో పాటు కోచ్ లను కూడా మార్చింది కానీ పర్ఫామెన్స్ లో మాత్రం ఎటువంటి వ్యత్యాసం కనపడలేదు.దీంతో ఈసారి టాలెంటెడ్ ప్లేయర్లను ఎంపిక చేసుకోవాలని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోంది.

అలాగే తమ టీమ్ పేరు ని చేంజ్ చేయాలని కూడా చూస్తోంది.

Telugu Delhi, Green Signal, Ipl, Xi Punjab, Punjab, Quarantee, Renamed, Ups-Late

గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం తమ టీమ్ పేరుని ఢిల్లీ క్యాపిటల్స్ గా పేరు మార్చుకుంది.పేరు మార్చుకున్న తర్వాత ఆ టీం ఐపీఎల్ లో మంచి పర్ఫామెన్స్ కనబరిచింది.రెండు సీజన్లలో ప్లే ఆప్స్ కి కూడా చేరింది.

దీంతో ఢిల్లీ తరహాలో తాము కూడా జట్టు పేరు మార్చుకోవాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం నిర్ణయించుకుంది.అలాగే ఈ విషయంలో బీసీసీఐ అనుమతి కూడా కోరింది.

టీమ్ వర్గాల ప్రకారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరుని పంజాబ్ కింగ్స్ గా మార్చాలని అనుకుంటున్నారట.ఐతే బీసీసీఐ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తమ టీమ్ యొక్క నూతన పేరుని వెల్లడించాలని పంజాబ్ ఫ్రాంచైజీ నిశ్చయించింది అని సమాచారం.

ఇకపోతే ఫిబ్రవరి 18వ తేదీన జరగనున్న వేలం పాటలో పాల్గొనేవారు స్వల్ప క్వారంటైన్ లో ఉండాలని బీసీసీఐ ఫ్రాంఛైజీలకు ఆదేశించింది.వేలంపేట లో పాల్గొనే వారికి ఒకరోజు ముందుగా కరోనా టెస్టులు నిర్వహిస్తామని బిసిసిఐ వెల్లడించింది.

ఈ కొవిడ్-19 నిర్ధారణ టెస్ట్ లు మూడు నాలుగు గంటల్లోనే ఫలితాలను వెల్లడిస్తాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube